ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka Assembly elections: కేసీఆర్ కీలక నిర్ణయం

ABN, First Publish Date - 2023-04-10T22:43:33+05:30

కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు

KCR key decision
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బెంగళూరు: కర్ణాటక శాససనభ ఎన్నికల (Karnataka Assembly elections) వేళ భారత్ రాష్ట్ర సమితి(BRS) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో జేడీఎస్‌కు(JDS) మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి(Kumara Swami) ధృవీకరించారు. కర్ణాటక ఎన్నికల్లో 59 స్థానాలు గెలిచి ముఖ్యమంత్రి అవుతానని కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీలో ఎవరితో పొత్తు పెట్టుకుంటారని విలేకరులు ప్రశ్నించారు. అయితే తాము ఏ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేది ముందుగా చెప్పలేమని కుమారస్వామి తెలిపారు. జేడీఎస్ ఇప్పటికే 97 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించగా, కాంగ్రెస్ 165 మంది పేర్లను ప్రకటించింది. బీజేపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించాల్సి ఉంది.

224మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 119మంది, కాంగ్రెస్‌‌కు 75 మంది, జేడీఎస్‌కు 28మంది సభ్యులుండగా 2సీట్లు ఖాళీగా ఉన్నాయి.

కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Updated Date - 2023-04-10T22:44:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising