ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kerala blasts: కన్వెన్షన్ సెంటర్‌లో పేలుళ్ల ఘటన‌పై ఎన్ఐఏ విచారణ

ABN, First Publish Date - 2023-10-29T15:16:25+05:30

కేరళలోని ఎర్నాకుళం జిల్లా కాలామస్సెరిలోని కన్వెన్షన్ హాలులో ఆదివారం ఉదయం జరిగిన వరుస పేలుళ్ల ఘటన సంచలనం తీవ్ర సంచలనం సృష్టించడంతో దీనిపై విచారణ బాధ్యతను ఎన్ఐఏ చేపట్టనుంది. ఢిల్లీ నుంచి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బృందం కూడా ఢిల్లీ నుంచి కేరళకు బయలుదేరింది.

కొచ్చి: కేరళ (Kerala)లోని ఎర్నాకుళం జిల్లా కాలామస్సెరిలోని కన్వెన్షన్ హాలులో ఆదివారం ఉదయం జరిగిన వరుస పేలుళ్ల (Serial blasts) ఘటన సంచలనం తీవ్ర సంచలనం సృష్టించడంతో దీనిపై విచారణ బాధ్యతను ఎన్ఐఏ (NIA) చేపట్టనుంది. ఢిల్లీ నుంచి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) బృందం కూడా ఢిల్లీ నుంచి కేరళకు బయలుదేరింది. కేరళ పేలుడు ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, 37 మంది గాయపడ్డారు.


ఒక అధికారితో సహా ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఎన్ఎస్‌జీ బృందం ఆదివారం సాయంత్రానికి కేరళ చేరుకుంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఘటన సమాచారం తెలిసిన వెంటనే విచారణ కోసం ఎన్ఐఏ టీమ్‌తో పాటు ఎన్ఎస్‌జీని ఘటనా స్థలికి వెళ్లాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదేశాలిచ్చారు. ఈ అదేశాలు అందుకున్న ఎన్‌ఎస్‌జీ చీఫ్ ఎంఏ గణపతి వెంటనే తమ టీమ్‌ను కేరళకు పంపారు.


కన్వెన్షన్ సెంటర్‌లో క్రైస్తవ ప్రార్థనలు జరుగుతుండగా జనం మధ్యలో పేలుడు జరిగిందని, 5 నిమిషాల వ్యవధిలోనే 3 పేలుళ్లు సంభవించాయని చెబుతున్నారు. ఈ ఘటనలో కుట్రకోణం ఉండవచ్చని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. టిఫిన్ బాక్స్‌లో పేలుడు పదార్ధాలు లభించినట్టు తెలుస్తోంది. ప్రాణాలు రక్షించుకోవడానికి బాధితులు పరుగులు తీస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఘటనకు కారకులైన వారిని విడిచిపెట్టేది లేదని చెప్పారు. సెలవుల్లో ఉన్న ఆరోగ్య కార్యకర్తలను విధుల్లోకి రావాలని ఆరోగ్యమంత్రి వీణా జార్జి ఆదేశించారు.

Updated Date - 2023-10-29T15:16:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising