ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Israel vs Palestine: ఇజ్రాయెల్ vs పాలస్తీనా యుద్ధంలో భారత మహిళకు తీవ్ర గాయాలు.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం ఎలా ఉందంటే..?

ABN, First Publish Date - 2023-10-09T13:57:38+05:30

ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు గాజా స్ట్రిప్ నుంచి రాకెట్లతో దాడి చేసిన చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడితో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ఇప్పుడు 'యుద్ధం'గా మారింది.

ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు గాజా స్ట్రిప్ నుంచి రాకెట్లతో దాడి చేసిన చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడితో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ఇప్పుడు 'యుద్ధం'గా మారింది. మూడు రోజులుగా భారీ క్షిపణులు, రాకెట్లతో ఇరుపక్షాలు పరస్పరం దాడి చేసుకుంటున్నాయి. ఈ దాడుల్లో భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. అనేక మంది క్షత్రగాత్రులు అయ్యారు. ఈ యుద్ధంలో మరణించిన వారి సంఖ్య ఇప్పటికే వెయ్యి దాటింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇందులో విదేశీయులు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన ఓ మహిళ ఈ యుద్ధంలో తీవ్రంగా గాయపడింది. కేరళకు చెందిన షీజా ఆనంద్ అనే 41 ఏళ్ల మహిళ ఇజ్రాయెల్‌లో కేర్‌టేకర్‌గా విధులు నిర్వర్తిస్తోంది.


షీజా కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడి చేయడానికి ముందు ఆమె వారి కుటుంబసభ్యులతో మాట్లాడింది. తాను క్షేమంగా ఉన్నట్లు వారికి తెలిపింది. దాడి తర్వాత రెండో సారి మధ్యాహ్నం ఆమె తన కుటుంబసభ్యలకు ఫోన్ చేసింది. కానీ ఆమె ఫోన్ మాట్లాడుతుండగానే సడంగా కాల్ డిస్‌కనెక్ట్ అయింది. మరుసటి రోజు ఇజ్రాయెల్ నుంచి కేరళకు చెందిన మరో భారతీయ వ్యక్తి ఫోన్ చేసి రాకెట్ల దాడిలో షీజా తీవ్రంగా గాయపడినట్లు కుటుంబసభ్యులకు తెలిపాడు. షీజాకు శస్త్రచికిత్స జరిగినట్లు చెప్పాడు. మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబసభ్యులకు వివరించాడు. కాగా షీజా ఆనంద్ గత ఏడు సంవత్సరాలుగా ఇజ్రాయెల్‌లో పని చేస్తోంది. ఆమె భర్త, ఇద్దరు పిల్లలు కేరళలోనే ఉంటున్నారు. కాగా షీజా ఆరోగ్యం గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు.

శనివారం ఉదయం ఇజ్రాయెల్‌పై హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. ‘ఆపరేషన్‌ ఆల్‌-అఖ్సా స్టార్మ్‌’ పేరుతో చేసిన ఈ దాడుల కోసం హమాస్ 2014లోనే ఏర్పాట్లు చేసుకున్నట్టు తాజాగా వెల్లడైంది. ఇజ్రాయెల్ షాక్‌కు గురయ్యేలా ఊహించని దాడులు చేయాలని హమాస్ పక్కా ప్లానింగ్ చేసుకుందని.. కొందరు యోధుల్ని విదేశాలకు పంపి మరీ ప్రత్యేక శిక్షణ ఇప్పించిందని తేలింది. అసలు ఈ దాడుల్లో హమాస్ గ్రూపు మోటారైజ్డ్ పారాగ్లైడర్లను వినియోగిస్తుందన్నది అతిపెద్ద ట్విస్ట్. గాల్లో నుంచి వీళ్లు దూసుకొచ్చి, సరిహద్దు కంచెలు దాటి.. ఇజ్రాయెల్ ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వీరిలో ఆత్మాహుతి బృందానికి చెందినవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-10-09T13:57:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising