Chandra Babu Arrest : అమిత్ షాకు కేశినేని నాని లేఖ.. చంద్రబాబు అరెస్ట్‌పై జోక్యం చేసుకోవాలని వినతి..
ABN, First Publish Date - 2023-09-09T11:18:57+05:30
తెలుగు దేశం పార్టీ ఎంపీ కేశినేని నాని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
విజయవాడ : తెలుగు దేశం పార్టీ ఎంపీ కేశినేని నాని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబును రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారని, వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.
కేశినేని నాని ప్రధాన మంత్రి కార్యాలయానికి కూడా ఓ ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, న్యాయాన్ని బలపరచాలని కోరారు. చంద్రబాబు నాయుడికి న్యాయం జరగాలని, ప్రజాస్వామ్యం చాలా విలువైనదని తెలిపారు.
చంద్రబాబు దశాబ్దాల తరబడి అంకితభావంతో దేశానికి సేవలందిస్తున్నారని తెలిపారు. స్వచ్ఛమైన పాలన కోసం, అభివృద్ధి కోసం ఆయన అంకితభావంతో చేసిన కృషిని ఇష్టపడే ప్రజలంతా ఆయన అరెస్ట్‌తో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు.
ఇవి కూడా చదవండి :
Chandra Babu Arrest : చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి
Updated Date - 2023-09-09T11:19:01+05:30 IST