ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Khushbu: రాహుల్ గాంధీకి జైలుశిక్ష...సినీనటి ఖుష్బూ చేసిన పాత ట్వీట్ వైరల్

ABN, First Publish Date - 2023-03-25T07:32:57+05:30

ప్రముఖ సినీనటి,జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ శనివారం మరోసారి వార్తల్లోకి ఎక్కారు....

BJP leader Khushbu Sundar, Rahul gandhi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: ప్రముఖ సినీనటి,జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ శనివారం మరోసారి వార్తల్లోకి ఎక్కారు.(BJP leader Khushbu) ‘‘మోదీ ఇంటిపేరు’’అవినీతిని సూచిస్తుందని 2018వ సంవత్సరంలో నాడు కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా ఉన్నపుడు ఖుష్బూ చేసిన ట్వీట్ వైరల్ అయింది. పరువునష్టం కేసులో జైలు శిక్ష ఖరారుతో అనర్హత వేటుకు గురైన రాహుల్ గాంధీ ఘటనతో(Rahul Gandhi convicted, disqualified) గతంలో కాంగ్రెస్ నాయకురాలైన, ప్రస్థుత బీజేపీ సభ్యురాలు,ప్రముఖ సినీనటి,జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ 2018వ సంవత్సరంలో చేసిన పాత ట్వీట్ (twitter)సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

2018వ సంవత్సరంలో ఇప్పుడు బీజేపీ నాయకురాలిగా ఉన్న ఖుష్బూ సుందర్ మోదీ అంటే అవినీతిగా మారారని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ చేసిన మోదీ ఇంటిపేరు వ్యాఖ్యకు సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతోపాటు, ఆయన లోక్‌సభకు అనర్హుడయిన తర్వాత నాడు ఖుష్బూ చేసిన పాత ట్వీట్ మళ్లీ తెరపైకి వచ్చింది.2018 వ సంవత్సరంలో ఖుష్బూ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పుడు‘‘యహన్ మోదీ వహన్ మోదీ జహాన్ దేఖో మోదీ(Mody)...లేకిన్ యే క్యా? హర్ మోదీకే ఆగే భ్రష్టాచార్ ఇంటిపేరు లగా హువా హై....#మోదీ ముత్లాబ్ #భ్రష్టచార్..మార్చుకుందాం’’ అని ఖుష్బూ ట్వీట్ చేసింది. మోడీ అంటే అవినీతికి చిరునామా అని,..#నిరవ్ #లలిత్ #నమో = అవినీతి అని ఖుష్బూ నాటి ట్వీట్‌లో పేర్కొంది.

పలువురు కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా ఖాతాల్లో ఇప్పటికీ అందుబాటులో ఉన్న ట్వీట్ స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నారు. ఇప్పుడు బీజేపీ నాయకురాలు, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అయిన ఖుష్బూ సుందర్‌పై గుజరాత్ మంత్రి పూర్ణేష్ మోదీ కేసు వేస్తారా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. రాహుల్ పై విధించిన అనర్హత వేటు రాజకీయ ప్రతీకార చర్యగా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఖండించడంతో ఇది భారీ రాజకీయ వివాదానికి దారితీసింది.రాహుల్ గాంధీ లోక్‌సభకు అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది.ఖుష్బూ సుందర్ తన పాత ట్వీట్‌పై వ్యాఖ్యానించకపోవడంతోపాటు తొలగించలేదు.

Updated Date - 2023-03-25T07:32:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising