ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rahul Gandhi : రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకారి : కేంద్ర మంత్రి

ABN, First Publish Date - 2023-03-09T14:39:41+05:30

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దేశ సమైక్యతకు అత్యంత తీవ్రమైన ప్రమాదకారి అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju)

Kiren Rijiju, Rahul Gandhi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దేశ సమైక్యతకు అత్యంత తీవ్రమైన ప్రమాదకారి అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఆరోపించారు. ఆయన భారత దేశ విభజన దిశగా ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన అన్ని పరిమితులను దాటిపోయారని దుయ్యబట్టారు.

కిరణ్ రిజిజు ఇచ్చిన ట్వీట్లలో, రాహుల్ గాంధీ మన మాట వినరని, అయితే ఆయనకు అంకితమైన శ్రేయోభిలాషుల మాటలను ఆయన వింటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఈ స్వయంప్రకటిత కాంగ్రెస్ యువరాజు అన్ని పరిమితులను దాటిపోయారన్నారు. భారత దేశ ఐకమత్యానికి ఈ వ్యక్తి అత్యంత తీవ్రమైన ప్రమాదకారిగా మారారన్నారు. భారత దేశాన్ని విభజించేందుకు ఆయన ప్రజలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. భారత దేశపు అత్యంత ప్రజాదరణగల, ఆత్మీయ ప్రేమను పొందుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అమలు చేస్తున్న మంత్రం ‘ఒక భారత దేశం, శ్రేష్ఠ భారత దేశం’ అని తెలిపారు. రాహుల్ గాంధీ ‘పప్పు’ అని భారతీయులకు తెలుసునని, ఆయన నిజంగా పప్పు అని విదేశీయులకు తెలియదని అన్నారు. ఆయన చేసిన మూర్ఖపు వ్యాఖ్యలకు స్పందించవలసిన అవసరం లేదని, అయితే ఆయన వ్యాఖ్యలను భారత వ్యతిరేక శక్తులు భారత దేశ పరువు, ప్రతిష్ఠలను దెబ్బతీసేందుకు దుర్వినియోగం చేస్తుండటమే సమస్య అని తెలిపారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను ఈ వరుస ట్వీట్లకు జత చేశారు.

రాహుల్ గాంధీ ఇటీవల బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం (Cambridge University)లో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత దేశ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. ‘‘భారత దేశం రాష్ట్రాల యూనియన్. ఇది రాజీ, సంభాషణ, సంప్రదింపులతో కూడుకున్నది. ఓ ఆలోచనను యూనియన్ మీద బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తే, అది ప్రతిస్పందిస్తుంది. ఇక్కడ ఓ సిక్కు వ్యక్తి కూర్చున్నారు. ఆయన సిక్కు మతస్థుడు. భారత దేశంలో ముస్లింలు ఉన్నారు. క్రైస్తవులు ఉన్నారు. భారత దేశంలో వేర్వేరు భాషలు ఉన్నాయి. వారంతా భారత దేశమే. ఆయన కాదని నరేంద్ర మోదీ అంటున్నారు. ఆయన ద్వితీయ శ్రేణి పౌరుడని మోదీ అంటున్నారు. నేను ఆయనతో ఏకీభవించను’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

ఇవి కూడా చదవండి :

Puri : పురి దుకాణాల సముదాయంలో అగ్ని ప్రమాదం... ముగ్గురికి గాయాలు...

China-Pak Vs India : చైనా, పాక్‌ల నుంచి భారత్ భద్రతకు ముప్పు : అమెరికన్ ఇంటెలిజెన్స్

Updated Date - 2023-03-09T14:49:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising