Karnataka polls: రైతు కొడుకుని పెళ్లాడే అమ్మాయిలకు మాజీ సీఎం కుమారస్వామి బంపరాఫర్.. ఊహించని ఎన్నికల హామీ
ABN, First Publish Date - 2023-04-11T19:54:44+05:30
కర్ణాటక ఎన్నికలు (Karnataka polls2023) సమీపిస్తుండడంతో అక్కడి పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. జనాలను ఆకర్షించే ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు.
బెంగళూరు: కర్ణాటక ఎన్నికలు (Karnataka polls2023) సమీపిస్తుండడంతో అక్కడి పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. జనాలను ఆకర్షించే ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. హామీల మీద హామీలు, వాగ్ధాలను నాయకులు కుమ్మరిస్తున్నారు. అన్నీ పార్టీల మాదిరిగానే జేడీఎస్ (JDS) అధినేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy) ఇచ్చిన ఓ హామీ ఆకట్టుకుంటోంది. రైతుల కొడుకులను పెళ్లి చేసుకునే యువతులకు తమ పార్టీ రూ.2 లక్షల నగదు ప్రోత్సాహం ఇస్తుందని ఆయన ఎన్నికల హామీ ప్రకటించారు. కొలార్‌లో ‘పంచరత్న’ ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన వాగ్ధానం చేశారు. రైతుల పిల్లల పెళ్లిళ్లను ప్రోత్సహించడమే తమ పార్టీ లక్ష్యమని, అందుకే ఈ హామీ ఇచ్చామన్నారు.
‘‘ రైతుల కొడుకులను పెళ్లాడేందుకు అమ్మాయిలు ఇష్టపడడం లేదంటూ నాకు ఒక పిటిషన్ అందింది. రైతు బిడ్డల వివాహాలను ప్రోత్సహించేందుకు అమ్మాయిలకు ప్రభుత్వం రూ.2 లక్షలు అందించాలి. మన యువకుల ఆత్మగౌరవాన్ని పరిరక్షించే చర్యల్లో భాగంగా తమ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది’’ అని కుమారస్వామి వెల్లడించారు.
కాగా మే 13న ఒకే దశలో కర్ణాటక ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 224 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా 123 స్థానాల్లో విజయం సాధించాలని జేడీఎస్ భావిస్తోంది. ఇప్పటికే 93 నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. కాగా కర్ణాటకలో జేడీఎస్‌కు బీఆర్ఎస్ మద్ధతిస్తోంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూడా ప్రచారం చేయనున్నారని కుమారస్వామి ఆదివారమే ప్రకటించారు. జేడీఎస్‌కు మద్దతుగా తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన మంత్రివర్గంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారానికి వస్తారని తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో కచ్చితంగా 59 స్థానాలు గెలిచి తీరుతామన్నారు. తమ పార్టీలో శకుని ఉన్నాడనీ, పార్టీని నాశనం చేయాలని చూస్తున్నాడని సోదరుడు రేవణ్ణను ఉద్దేశించి మండిపడ్డ విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Bandi Sanjay Vs Ranganath : బండి సంజయ్ చేసిన ప్రతి ఆరోపణకు స్ట్రాంగ్ రియాక్షనిస్తూ.. ఛాలెంజ్ చేసిన సీపీ రంగనాథ్..
Sajjala: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో తెలంగాణ బిడ్డింగ్‌పై సజ్జల స్పందన.. చాలా పరిమితులు ఉన్నాయంటూ..
Updated Date - 2023-04-11T20:00:09+05:30 IST