KhushbuSundar: ఎయిర్‌పోర్ట్‌లో ఖుష్బూకి అవమానం..
ABN, First Publish Date - 2023-02-01T14:20:28+05:30
నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్‌కు చెన్నై విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. మోకాలి గాయంతో బాధపడుతున్న..
చెన్నై: నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ (Kushbu Sundar)కు చెన్నై విమానాశ్రయంలో (Airport) చేదు అనుభవం ఎదురైంది. మోకాలి గాయంతో బాధపడుతున్న ఆమె వీల్ చైర్ కోసం 30 నిమిషాల పాటు వేచిచూడాల్సి వచ్చింది. దీంతో ఆమె తీవ్ర అసహనానికి గురయ్యారు. ట్విటర్ వేదకగా ఎయిర్ ఇండియా సంస్థపై ఆమె ఫైర్ అయ్యారు.
''డియర్ ఎయిరిండియా..మోకాలి గాయంతో బాధపడుతున్న ప్రయాణికురాలిని తీసుకు వెళ్లేందుకు మీ దగ్గర కనీసం వీల్ చైర్ కూడా లేదు. లెగ్మెంట్ గాయంతో కట్టుతో ఉన్న నేను చెన్నై విమానాశ్రయంలో 30 నిమిషాల పాటు వేచిచూడాల్సి వచ్చింది. మీ సిబ్బంది మరో ఎయిర్‌లైన్ నుంచి వీల్‌చైర్ తీసుకు వచ్చి నన్ను తీసుకువెళ్లారు. మీరు మరింత మెరుగ్గా సేవలు అందించగలరని ఆశిస్తున్నాను'' అని ఖుష్బూ ట్వీట్ చేశారు. ఖుబ్భూ ట్వీట్‌కు మద్దతుగా పలువురు ట్వీట్లు చేశారు. దీనిపై ఎయిరిండియా సంస్థ నిర్వాహకులు వెంటనే కుష్బూకు క్షమాపణలు తెలిపింది. ''మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. వెంటనే ఈ విషయాన్ని చెన్నై విమాన నిర్వాహకులకు తెలియజేస్తాం'' అని ఎయిర్‌లైన్ ట్వీట్ చేసింది.
కాగా, ఇటీవల కాలం ఎయిరిండియా సంస్థ అడపాదడపా విమర్శలకు గురవుతోంది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన కేసు ఇటీవల సంచలనం సృష్టించింది. నెలరోజులు ఆలస్యంగా ఈ ఘటన వెలుగుచూసింది. ఎయిరిండియాకు మహిళ చేసిన ఫిర్యాదుతో విమానయాన సంస్థలో కదలిక వచ్చింది. విమాన సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఇంత జరిగిన తర్వాత కూడా నిందితుడు తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోయాడని ఆ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో సదరు నిందితుడు శంకర్ మిశ్రాపై ఎయిర్ ఇండియా నాలుగు నెలల పాటు నిషేధం విధించింది. దీనిపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. నాలుగు నెలలు విమాన ప్రయాణాలు లేకుండా చేయడం ఏపాటి శిక్ష అంటూ పలువురు నిలదీశారు.
Updated Date - 2023-02-01T14:22:48+05:30 IST