ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lalan Singh: జేడీయూలో కీలక పరిణామం.. అధ్యక్ష పదవికి లలన్ సింగ్ గుడ్‌బై..

ABN, Publish Date - Dec 26 , 2023 | 04:56 PM

బీహార్‌లోని అధికార పార్టీ జనతా దళ్-యునైటెడ్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. పార్టీ అధ్యక్ష పదవికి లలన్ సింగ్ మంగళవారంనాడు రాజీనామా చేశారు. జేడీయూలో కీలక వ్యక్తిగా పేరున్న లలన్ సింగ్ తన రాజీనామా పత్రాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు పంపినట్టు పార్టీ వర్గాల సమాచారం.

పాట్నా: బీహార్‌లోని అధికార పార్టీ జనతా దళ్-యునైటెడ్ (JDU)లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. పార్టీ అధ్యక్ష పదవికి లలన్ సింగ్ (Lalan Singh) మంగళవారంనాడు రాజీనామా చేశారు. జేడీయూలో కీలక వ్యక్తిగా పేరున్న లలన్ సింగ్ తన రాజీనామా పత్రాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు పంపినట్టు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై రాజకీయ చర్చలు జరగనున్నట్టు ఊహాగానాల వినిపిస్తున్న నేపథ్యంలో పార్టీ పదవికి లలన్ సింగ్ రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


రాజీనామా ఇంకా ఆమోదించలేదు..

లలన్ సింగ్ రాజీనామాను నితిష్ కుమార్ వెంటనే ఆమోదించలేదని తెలుస్తోంది. లలన్ సింగ్ రాజీనామా నిర్ణయం వెనుక ఇతమిత్ధమైన కారణం ఏమిటనేది కూడా ఇంకా తెలియలేదు. పార్టీలో అంతర్గతంగా చిక్కులు తలెత్తి ఉండవచ్చని, ఈ పరిణామంతో బీహార్ రాజకీయ ముఖచిత్రంలో అస్థిరత తలెత్తే అవకాశాలు ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈనెల 29న జేడీయూ కీలక సమావేశం జరుగనున్నందున లలన్ సింగ్ రాజీనామా ఆమోదంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్‌ను పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించే అవకాశం ఉందని పార్టీ అంతర్గత వర్గాల్లో ఇంతకుముందు కూడా వినిపించింది. లలన్ సింగ్ స్థానంలో స్యయంగా నితీష్ కుమార్ ఆ బాధ్యతలు చేపడతారని చెబుతున్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తకుండా ఉండేందుకు లలన్ సింగ్‌ను తప్పించాలని నితీష్ సన్నిహితులు ఆయనకు సూచించారని కూడా చెబుతున్నారు.


నితీష్ అసంతృప్తి...

కాగా, లలన్ సింగ్ ప్రవర్తనపై కూడా నితీష్ కుమార్ కొద్దికాలంగా అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసలాద్ యాదవ్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు లలన్ సింగ్‌ దగ్గరవుతుండటం నితీష్ అసంతృప్తికి కారణంగా చెబుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ టిక్కెట్‌పై ముంగెర్ నుంచి పోటీ చేసే విషయాన్ని ఆయన పరిశీలిస్తున్నారనే సంకేతాలు వెలువడటం మరో కారణమని అంటున్నారు. పార్టీ జాతీయ స్థాయి ఆకాంక్షలకు అనుగుణంగా 'ఇండియా' కూటమి సభ్యులను సమన్వయ పరచడంలోనూ లలన్ సింగ్ విఫలమయ్యారనే ఆరోపణలపై కూడా నితీష్ అసంతృప్తితో ఉన్నారు.


కాగా, నాయకత్వంలో మార్పులు జరుగనున్నాయనే ఊహాగానాలే నిజమైన పక్షంలో లలన్ సింగ్ ఇతర పార్టీల నేతలతో చేతులు కలిపే అవకాశం లేకపోలేదని అంటున్నారు. జార్జి ఫెర్డాండెజ్, శరద్ యాదవ్, ఆర్సీపీ సింగ్, ఉపేంద్ర కుష్వాహ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ వంటి నేతలతో ఆయన చేతులు కలపే అవకాశం ఉంది. అదే జరిగితే, బీహార్ రాజకీయ ముఖచిత్రంలో కీలక మార్పులు జరిగే అవకాశాలున్నాయని రాజకీయ పండితులు చెబుతున్నారు.

Updated Date - Dec 26 , 2023 | 04:56 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising