ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lalu Prasad: సర్జరీ తర్వాత స్వదేశానికి లాలూ... కుమార్తె భావోద్వోగ ట్వీట్

ABN, First Publish Date - 2023-02-11T14:59:32+05:30

రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం శనివారంనాడు సింగపూర్ నుంచి ఢిల్లీకి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: కిడ్నీ మార్పిడి చికిత్స ఇటీవల విజయవంతంగా పూర్తి చేసుకున్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) యాదవ్ శనివారంనాడు సింగపూర్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. లాలూకు కిడ్నీ ఇచ్చిన ఆయన కుమార్తె రోహిణి ఆచార్య (Rohini Acharya) ఈ విషయాన్ని భావోద్వేగంతో కూడిన ఓ ట్వీట్‌లో తెలియజేశారు. ''చాలా ముఖ్యమైన విషయం మీ దృష్టికి తెస్తున్నాను. మన నేత లాలూజీ ఆరోగ్యం గురించి చెప్పదలచుకున్నారు. ఫిబ్రవరి 11న నాన్నగారు సింగపూర్ నుంచి ఇండియా వెళ్తున్నారు. ఒక కుమార్తెగా నేను నా విధి నిర్వర్తించాను. నాన్నకు ఆరోగ్యం చేకూరిన తర్వాత మీ ముందుకు పంపుతున్నాను. ఇప్పుడు ఆయనను మీరే జాగ్రత్తగా చూసుకోవాలి'' అని రోహిణి ఆచార్య ఆ ట్వీట్‌లో తెలిపారు. ట్వీట్‌కు ఒక వీడియోను కూడా జత చేశారు.

లాలూప్రసాద్ యాదవ్ గత డిసెంబర్‌లో సింగపూర్‌లోని ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. లాలూ కుమరుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అప్పుడు సింగపూర్‌లోనే ఉన్నారు. తన తండ్రి కిడ్నీ ఆపరేషన్ విజయవంతమైందని, ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకు మార్చారని, కిడ్నీ ఇచ్చిన తన సోదరి రోహిణి ఆచార్య, పార్టీ జాతీయ అధ్యక్షుడు లాలూ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ట్వీట్ చేశారు. లాలూ ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఆ తర్వాత తేజస్వి యాదవ్‌కు ఫోన్ చేసి లాలూ క్షేమసమాచారాలను అడిగి తెలుసుకున్నారు.

లాలూ శస్త్ర చికిత్సకు ముందు కిడ్నీ మార్పిడి కోసం జరిపిన పరీక్షల్లో రోహిణి ఆచార్య కిడ్నీ మ్యా్చ్ అయింది. ఈ విషయాన్ని తేజస్వి గతంలో ఒక ట్వీట్‌లో తెలిపారు. తన సోదరి కూడా అందుకు మందుకు రావడంతో కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. 74 ఏళ్ల లాలూ ప్రసాద్ కొద్ది కాలంగా కిడ్నీ సంబంధిత తీవ్ర సమస్యలను ఎదుర్కొంటూ వచ్చారు. కిడ్నీ మార్పిడి చేయించుకోవాలని వైద్యులు సూచించారు. కిడ్నీ ఇచ్చేందుకు రోహిణి ఆచార్య ముందుకు రావడంతో సర్జరీకి సింగపూర్‌లో చేయించాలని లాలూ కుటుంబం నిర్ణయించింది. వృత్తిరీత్యా ఇంజనీరు అయిన రావు సమ్రేష్ సింగ్‌ను రోహిణి ఆచార్య వివాహం చేసుకున్నారు. ఇద్దరూ సింగపూర్‌లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Updated Date - 2023-02-11T14:59:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising