ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Land for jobs scam: తేజస్వీయాదవ్, మీసాభారతిలను ప్రశ్నించిన సీబీఐ,ఈడీ

ABN, First Publish Date - 2023-03-25T12:36:29+05:30

ఉద్యోగాల కోసం భూ కుంభకోణం కేసులో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ ను సీబీఐ, ఆయన సోదరి మీసా భారతిని ఈడీ శనివారం ప్రశ్నించింది....

Tejashwi Yadav, sister Misa Bharti
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : ఉద్యోగాల కోసం భూ కుంభకోణం కేసులో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ ను సీబీఐ, ఆయన సోదరి మీసా భారతిని ఈడీ శనివారం ప్రశ్నించింది.విచారణ కోసం న్యూఢిల్లీలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రధాన కార్యాలయానికి వచ్చినప్పుడు, తాను, తన కుటుంబం ఈ కేసులో పోరాడాలని నిర్ణయించుకున్నట్లు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ చెప్పారు.మరోవైపు ఇదే కేసుకు సంబంధించి తేజస్వి సోదరి మీసా భారతిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం ఢిల్లీ కార్యాలయంలో ప్రశ్నించింది.

ఉద్యోగాల కోసం భూ కుంభకోణంలో తేజస్వీ సోదరి మిసా భారతిని ప్రశ్నించే ముందు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మీసాభారతి ఇంటికి వెళ్లారు.ప్రాంతీయ పార్టీల పరువు తీసేందుకు ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలను బీజేపీ దుర్వినియోగం చేసిందని అఖిలేష్ అన్నారు.భూమి-ఉద్యోగాల కుంభకోణం కేసులో తేజస్వి యాదవ్‌ను ఈ నెలలో అరెస్టు చేసే ఆలోచన లేదని సీబీఐ న్యాయవాది జస్టిస్ దినేష్ కుమార్ శర్మ ముందు చెప్పారు. సీబీఐ తనకు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలంటూ తేజస్వీ యాదవ్‌పై వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.దీంతో తేజస్వీ విచారణకు హాజరు అయ్యారు.

ఇది కూడా చదవండి : Sansad Ratna award: సంసద్ రత్న అవార్డుల్లో తెలుగు రాష్ట్రాల ఎంపీలకు చోటేది?

యాదవ్ కుటుంబంపై సీబీఐ, ఈడీ గురి పెట్టింది. ఈ నెల 7న ఈ కేసుకు సంబంధించి ఆర్‌జేడీ అధినేత, తేజస్వీ తండ్రి లాలూ యాదవ్‌ను సీబీఐ ప్రశ్నించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఒకరోజు ముందు లాలూ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవిని కేంద్ర ఏజెన్సీ పాట్నా నివాసంలో ప్రశ్నించింది.సీబీఐ పరిశీలన అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసులో చర్యలు తీసుకుంది. ఈ నెల 10న ఢిల్లీలోని తేజస్వి యాదవ్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది.

Updated Date - 2023-03-25T12:36:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising