Sidharamaiah: సీఎం 'లోకల్' మంత్రం...అలా చేస్తేనే..
ABN, Publish Date - Dec 24 , 2023 | 04:10 PM
ఫ్యాక్టరీల్లో పనుల కోసం స్థానికులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మైసూరు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల్లో స్థానిక ప్రజలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఫ్యాక్టరీల యాజమాన్యాలకు సూచించారు. మైసూరులోని పలు ప్యాక్టరీల అధిపతులతో ఆదివారంనాడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ఈ సూచన చేశారు.
బెంగళూరు: ఫ్యాక్టరీల్లో పనుల కోసం స్థానికులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) అన్నారు. మైసూరు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల్లో స్థానిక ప్రజలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఫ్యాక్టరీల యాజమాన్యాలకు సూచించారు. మైసూరులోని పలు ప్యాక్టరీల అధిపతులతో ఆదివారంనాడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, సాంకేతికంగా నిపుణులైన వ్యక్తులు స్థానికంగా లేనప్పుడు మాత్రమే బయట వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు.
స్థానికులకు ఉద్యోగాలు దొరకడం లేదనే అంశాన్ని సీఎం ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో వృత్తి నైపుణ్యాలు కలిగిన మానవ వనరులకు కొదవలేదని, తప్పుడు కారణాలతో స్థానికులకు ఉద్యోగావకాశాలను నిరాకరించరాదని అన్నారు. ఫ్యాక్టరీలు ప్రశాంతంగా నడవాలని, తమ ప్రభుత్వం నిరుద్యోగ గ్రాడ్యుయేట్ల కోసం యువనిధి పథకాన్ని అమలు చేయనుందని, వచ్చే జనవరి 12న ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ప్రొషెషనల్ స్కిల్స్ అవసరమైన చోట అందుకు తగినట్టుగా గ్రాడ్యుయేట్లకు ప్రభుత్వం శిక్షణ ఇస్తుందని తెలిపారు. స్థానికులకు ఉపాధి కల్పించడం ద్వారా ఫ్యాక్టరీలను మరింత అభివృద్ధి చేసుకుంటే జీడీపీ పెరుగుతుందని, రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఫ్యాక్టరీల ఏర్పాటుకు ఎవరి భూములైతే తీసుకుంటారో వారి కుటుంబాలకు తప్పనిసరిగా ఉద్యోగాలివ్వాలని, స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. వత్తిపరమైన నైపుణ్యాల కోసం వారికి శిక్షణ ఇచ్చి, రిక్రూట్ చేసుకోవాలని ఫ్యాక్టరీల యాజమానులకు సీఎం సూచించారు. స్థానికులకు ఉద్యోగాలకు కల్పించే పక్షంలో కొత్త ఫ్యాక్టరీలకు ఆమోదం తెలుపుతామని, ఉద్యోగాలు కల్పించనట్లయితే ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఫ్యాక్టరీలు మంజూరు చేసిందో ఆ ఉద్దేశం నెరవేరదని చెప్పారు. స్థానికులకు ఉద్యోగాలిస్తే ఫ్యాక్టరీలకు అవసరమైన సౌకర్యాలు, పరిశ్రమలకు సడలింపులు ఇస్తామని సీఎం స్పష్టం చేశారు.
Updated Date - Dec 24 , 2023 | 04:10 PM