ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM Modi: హుకుంచంద్ మిల్ వర్కర్లకు న్యాయం.. రూ.224 కోట్ల బకాయిలు విడుదల చేసిన మోదీ

ABN, Publish Date - Dec 25 , 2023 | 03:06 PM

బకాయిల కోసం ఇండోర్‌లోని హుకుంచంద్ మిల్ వర్కర్ల చిరకాలంగా చేస్తున్న డిమాండ్‌ ఎట్టకేలకు నెరవేరింది. కార్మికులకు ఇవ్వాల్సిన రూ.224 కోట్ల బకాయిల మొత్తం చెక్కును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందజేశారు. ఆదివారంనాడు ఈ చెక్కును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఫీషియల్ లిక్విడేటర్, హుకుంచంద్ మిల్ కార్మిక సంఘం ప్రతినిధులకు పీఎం అందించారు.

న్యూఢిల్లీ: బకాయిల కోసం మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని హుకుంచంద్ మిల్ (Hukumchand mill) వర్కర్లు చిరకాలంగా చేస్తున్న డిమాండ్‌ ఎట్టకేలకు నెరవేరింది. కార్మికులకు ఇవ్వాల్సిన రూ.224 కోట్ల బకాయిల మొత్తం చెక్కును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అందజేశారు. సోమవారంనాడు ఈ చెక్కును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఫీషియల్ లిక్విడేటర్, హుకుంచంద్ మిల్ కార్మిక సంఘం ప్రతినిధులకు పీఎం అందించారు.


హుకుంచంద్ వర్కర్ల చిరకాల పెండింగ్ డిమాండ్‌ను సెటిల్ చేసేందుకు ఇండోర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడారు. ఈరోజు సుపరిపాలనా దినోత్సవం (Good Governance Day) తరుణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రూ.224 కోట్ల చెక్కును అప్పగించామని చెప్పారు. రాబోయే రోజుల్లో మిల్లు కార్మికులందరికీ ఆ మొత్తం అందుతుందని చెప్పారు. ''మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం నాకు తెలుసు. కానీ, ఇప్పుడు మీకు ఎంచో ఉజ్వల భవిష్యత్తు ఉంది. కార్మికులకు న్యాయం జరిగిన డిసెంబర్ 25వ తేదీని ఇండోర్ ప్రజలంతా గుర్తుపెట్టుకుంటారు'' అని మోదీ అన్నారు.


ఇండోర్‌లోని హుకుంచంద్ మిల్ 1992లో మూతపడింది. అప్పట్నించీ కార్మికులు తమ బకాయిల కోసం న్యాయపోరాటం సాగిస్తూ వచ్చారు. ఇటీవలే మధ్యప్రదేశ్ ప్రభుత్వం సెటిల్‌మెంట్ ప్యాకేజీ కోసం సంప్రదింపులు సాగించింది. కోర్టులు, కార్మిక సంఘాలు, మిల్ వర్కర్లతో సంప్రదింపులు జరిపి విజయవంతంగా సెటిల్‌మెంట్ ప్యాకేజీ తెచ్చింది. ఈ సెటిల్‌మెంట్ ప్లాన్ ప్రకారం కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలన్నీ మధ్యప్రదేశ్ ప్రభుత్వమే చెల్లిస్తుంది. మిల్లు భూమిని తమ అధీనంలోకి తెచ్చుకుని, రెసిడెన్సియల్, వాణిజ్య సముదాయాలను డవలప్ చేస్తుంది.

Updated Date - Dec 25 , 2023 | 03:06 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising