ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Narendra Modi: భూ మండలంపై అత్యంత శక్తిమంతమైన నేత మోదీ

ABN, First Publish Date - 2023-01-20T21:43:49+05:30

భూ మండలంపై అత్యంత శక్తిమంతమైన నేత మోదీ అని బ్రిటన్ ఎంపీ లార్డ్ కరన్ బిలిమోరియా ప్రశంసించారు.

Lord Karan Bilimoria praises Prime Minister Narendra Modi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: భూ మండలంపై అత్యంత శక్తిమంతమైన నేత మోదీ అని బ్రిటన్ ఎంపీ లార్డ్ కరన్ బిలిమోరియా ప్రశంసించారు. చిన్నతనంలో చాయ్ అమ్మిన పిల్లాడు నేడు భారత ప్రధానియై భూమిపై అత్యంత శక్తిమంతమైన నేతగా ఎదిగారని కీర్తించారు. భారత్- బ్రిటన్ సంబంధాల ప్రాధాన్యత అంశంపై పార్లమెంట్‌లో జరిగిన డిబేట్ సందర్భంగా కరన్ మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జీ20 నాయకత్వ బాధ్యతలు తీసుకున్న భారత్ ప్రపంచంలో రెండో బలమైన ఆర్ధిక శక్తిగా ఎదిగే లక్ష్యం పెట్టుకుందని లార్డ్ కరన్ బిలిమోరియా అన్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందనుందని చెప్పారు. రానున్న దశాబ్దాల్లో కూడా భారత్‌కు బ్రిటన్ నమ్మకమైన స్నేహ దేశంగా ఉంటుందని చెప్పారు. బ్రిటన్‌ను దాటేసిన భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ఐదో బలమైన ఆర్ధిక శక్తిగా ఎదిగిందన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్యంతో భారత్ యువ దేశంగా ఉందని గడచిన ఆర్ధిక సంవత్సరంలో 8.7 వృద్ధి రేటు సాధించిందన్నారు. యూనికార్న్ కంపెనీల విజృంభణ మొదలైందని, పునరుత్పాదక శక్తి, సౌర శక్తి ఉత్పాదనలో భారత్ నాలుగో పెద్ద దేశంగా నిలిచిందన్నారు. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్లు తయారు చేసి బిలియన్ల మందికి అందజేసి తన శక్తి సామర్థ్యాలు నిరూపించుకుందని ఆయన ప్రశంసలు కురిపించారు. భారత్‌తో బ్రిటన్ ఆర్ధిక సంబంధాలు మరింత బలపడాలని లార్డ్ కరన్ బిలిమోరియా ఆకాంక్షించారు.

Updated Date - 2023-01-20T21:47:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising