ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Eknath Shinde: మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం

ABN, First Publish Date - 2023-01-31T17:19:09+05:30

రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుల విషయంలో 50 శాతం రాష్ట్ర వాటాను నిరాకరిస్తూ గత 'మహా వికాస్ అఘాడి' (MVA) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని షిండే ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇదే సమయంలో రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కేంద్రంతో మాట్లాడాలని ఎంపీలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

లోక్‌సభ ఎంపీలతో మంగళవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో షిండే మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం వద్ద పలు ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇవి కార్యరూపం దాలిస్తే సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. వాటిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా మనం ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఎంపీలు ఇచ్చే సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని పరిస్థితిని సమీక్షించేందుకు రెండు నెలల తర్వాత వారితో మరో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు. ''తదుపరి విడత నిధులు విడుదల చేయాలంటే కేటాయించిన డబ్బులకు సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు చాలా కీలకం. సకాలంలో నివేదికలను సమర్పించే విషయంలో వివిధ శాఖల కార్యదర్శులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది'' అని సీఎం అన్నారు. మహారాష్ట్ర నుంచి లోక్‌సభలో 48 మంది ఎంపీలున్నారు.

50 శాతం రాష్ట్ర నిధులతో ప్రాజెక్టులు వేగవంతం: ఫడ్నవిస్

కాగా, రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్రం నుంచి 50 శాతం కంట్రిబ్యూషన్ ఇవ్వరాదని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకున్నట్టు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు. తద్వారా రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన 50 శాతం నిధులను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. దీంతో రైల్వే ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తవుతాయని తెలిపారు. కాగా, షిండే ఏర్పాటు చేసిన ఎంపీల సమావేశానికి రాష్ట్రానికి చెందిన పలువురు విపక్ష ఎంపీలు గైర్హాజరయ్యారు. శివసేన ఇటీవల రెండుగా చీలిపోవడంతో మహా వికాస్ అఘాడి ప్రభుత్వం అధికారం కోల్పోయింది. చీలిక వర్గమైన షిండే వర్గంతో బీజేపీ పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చింది.

Updated Date - 2023-01-31T17:19:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising