ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mahila Samman Yojana: మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

ABN, First Publish Date - 2023-04-03T23:10:44+05:30

ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. మహిళా సమ్మాన్ యోజన (Mahila Samman Yojana) కింద అన్ని రకాల బస్సు ప్రయాణాల్లో 50 శాతం డిస్కౌంట్(50 per cent travel discount) ఇవ్వాలని నిర్ణయించింది.

Mahila Samman Yojana
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. మహిళా సమ్మాన్ యోజన (Mahila Samman Yojana) కింద అన్ని రకాల బస్సు ప్రయాణాల్లో 50 శాతం డిస్కౌంట్(50 per cent travel discount) ఇవ్వాలని నిర్ణయించింది. మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే(Eknath Shinde) సారథ్యంలోని శివసేన-బీజేపీ(Shiv Sena-BJP) ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ పర్హవీన్ కార్పొరేషన్‌కు చెందిన అన్ని రకాల బస్సుల్లో మహిళలకు 50 శాతం డిస్కౌంట్ ఇవ్వాలంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి మొన్న బడ్జెట్ సమావేశాల్లో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Maharashtra Deputy CM Devendra Fadnavis) మహిళలకు 50 శాతం డిస్కౌంట్‌తో బస్సు ప్రయాణాల ప్రకటన చేశారు.

2019లో మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Assembly Elections 2019) శివసేన-బీజేపీ పొత్తులో సీట్లు పంచుకుని అధికారం చేపట్టేందుకు కావాల్సిన స్థానాలు సంపాదించారు. బీజేపీకి ఎక్కువ స్థానాలు రావడంతో బాల్ థాకరే సమయంలోనే కుదిరిన పాత ఫార్ములా ప్రకారం ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే వారికే ముఖ్యమంత్రి పీఠమనే విషయానికి ఉద్ధవ్ థాకరే తిలోదకాలిచ్చారు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహావికాస్ అఘాడి ఏర్పాటు చేసుకుని రెండున్నరేళ్లు మహారాష్ట్ర సీఎంగా కొనసాగారు. అయితే హిందుత్వ సిద్ధాంతాలపై ఉద్ధవ్ రాజీ పడటంతో ఆయన భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. గత ఏడాది జూన్‌లో మెజార్టీ శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు శివసేన ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) జట్టులో చేరిపోయారు. సీఎం పదవి కోల్పోవడంతో పాటు ఉద్ధవ్ ఒంటరివారైపోయారు. ఏక్‌నాథ్ షిండే సీఎం అయ్యారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు.

Updated Date - 2023-04-03T23:14:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising