ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TMC: ఫొటోలతో దుష్ప్రచారం చేస్తున్నారు.. బీజేపీపై టీఎంసీ ఎంపీ ఫైర్

ABN, First Publish Date - 2023-10-15T15:23:05+05:30

సోషల్ మీడియాలో తన వ్యక్తిగత ఫొటోలను అవమానకర రీతిలో మార్చి, అసభ్యకర హ్యాష్ ట్యాగ్ లు యాడ్ చేసిన ఘటనపై టీఎంసీ(TMC) ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra) స్పందించారు. దానిని బీజేపీ(BJP) ట్రోల్ సేన పనిగా ఆరోపించారు. ఆమె ఫొటోలు ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కోల్‌కతా: సోషల్ మీడియాలో తన వ్యక్తిగత ఫొటోలను అవమానకర రీతిలో మార్చి, అసభ్యకర హ్యాష్ ట్యాగ్ లు యాడ్ చేసిన ఘటనపై టీఎంసీ(TMC) ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra) స్పందించారు. దానిని బీజేపీ(BJP) ట్రోల్ సేన పనిగా ఆరోపించారు. ఆమె ఫొటోలు ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


ఆమె మాట్లాడుతూ.. "నేను కాంగ్రెస్ నేత శశి థరూర్(Shashi Tharoor) తో కలిసి దిగిన ఫొటోను మార్ఫింగ్ చేసి అసభ్యకర హ్యాష్ ట్యాగ్ జోడించి దానిని బీజేపీ సోషల్ మీడియా సేనలు సర్క్యూలేట్ చేశాయి. అలా చేసి వారు పైశాచికానందం పొందుతున్నారు. ఆ పార్టీకి మహిళల పట్ల ఉన్న ద్వేషాన్ని ఇది తెలియజేస్తోంది" అని వ్యాఖ్యానించారు. ఆమెకు సంబంధించిన మరో ఫొటోలో సిగరెట్ పట్టుకున్నట్లు ఉంది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. "మేడం ధూమపానం ఆరోగ్యానికి మంచిదా కాదు. దానితో క్యాన్సర్ వస్తుంది"అని సూచించాడు. దీనిపై ఎంపీ స్పందిస్తూ తాను సిగరెట్ తాగనని.. అవంటే ఎలర్జీ అంటూ.. ఫ్రెండ్ సిగార్ తో జోక్ చేస్తూ అలా ఫోన్ కు ఫోజులిచ్చినట్లు తెలిపారు. ఈ ఫొటోలు వైరల్ గా మారడంతో టీఎంసీ, బీజేపీల మధ్య పొలిటికల్ హీట్ పెరిగింది.

Updated Date - 2023-10-15T15:24:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising