Raebareli: స్మృతి ఇరానీ పర్యటనలో భద్రతా లోపం..
ABN, First Publish Date - 2023-06-09T19:01:50+05:30
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ శుక్రవారంనాడు రాయబరేలిలో జరిపిన పర్యటనలో భద్రతా లోపం టుచేసుకుంది. ఆమె కాన్వాయ్ ముందుకు ఒక వ్యక్తి దూసుకెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతన్ని అదుపులోనికి తీసుకున్నారు.
రాయబరేలి: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) శుక్రవారంనాడు రాయబరేలి (Raebareli)లో జరిపిన పర్యటనలో భద్రతా లోపం (Security Lapse) చోటుచేసుకుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నియోజకవర్గంలో స్మృతి ఇరానీ పర్యటిస్తుండగా ఆమె కాన్వాయ్ ముందుకు ఒక వ్యక్తి దూసుకెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతన్ని అదుపులోనికి తీసుకున్నారు.
కాన్వాయ్ ముందుకు దూకిన వ్యక్తి పేరు ధీరేంద్ర సింగ్ అని, నగర పంచాయత్‌లో పనిచేస్తున్న ఆ వ్యక్తి గత మే 5న ఉద్యోగం నుంచి ఉద్వాసనకు గురయ్యాడని తెలుస్తోంది. కాన్వాయ్‌కు అడ్డుపడిన అతనికి వెంటనే మెడికల్ చెకప్ చేయించమని స్మృతి ఇరానీ అధికారులను ఆదేశించారు. పరష్‌దేపూర్ నగర్ పంచాయత్‌లో పనిచేసే 14 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఇటీవల తొలగించగా, వారిలో ధీరేంద్ర సింగ్ కూడా ఉన్నాడని చెబుతున్నారు.
Updated Date - 2023-06-09T19:01:50+05:30 IST