Manipur: మణిపుర్‌లో చల్లారని ఆగ్రహజ్వాలలు.. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్న సీఎం
ABN, First Publish Date - 2023-09-30T15:27:40+05:30
రాష్ట్రంలో ఇద్దరు విద్యార్థుల(Students) దారుణ హత్య ఉదంతానికి సంబంధించిన వీడియోలు విడుదలైన తరువాత సీఎం బీరెన్ సింగ్(Biren Singh) పై ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. హత్యలను నిరసిస్తూ రాజధాని ఇంఫాల్(Imphal) లో ప్రజలు, విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం కీలక ప్రకటన చేశారు. హత్యకు పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
మణిపుర్: రాష్ట్రంలో ఇద్దరు విద్యార్థుల(Students) దారుణ హత్య ఉదంతానికి సంబంధించిన వీడియోలు విడుదలైన తరువాత సీఎం బీరెన్ సింగ్(Biren Singh) పై ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. హత్యలను నిరసిస్తూ రాజధాని ఇంఫాల్(Imphal) లో ప్రజలు, విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం కీలక ప్రకటన చేశారు. హత్యకు పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.
విద్యార్థుల అనుమానాస్పద మృతి తరువాత రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి నుంచి ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. నిరసనల కారణంగా ప్రభుత్వం అక్టోబర్ 1 వరకు ఇంటర్నెట్(Internet) సేవలపై మళ్లీ నిషేధం విధించింది. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ(CBI) దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఇంఫాల్‌లోని మణిపూర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సీనియర్ అధికారులు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించారు.
సీఎం పూర్వీకుల ఇంటిపై దాడి..
ఇంఫాల్‌లోని మణిపూర్ సీఎం పూర్వీకుల ఇంటిపై గురువారం రాత్రి నిరసనకారుల దాడికి ప్రయత్నించింది. వారిని చెదరగొట్టడానికి భద్రతా దళాలు టియర్ గ్యాస్ ను ప్రయోగించాయి. ఈ ఏడాది ప్రథామార్థంలో కుకీ, మైతేయి తెగల మధ్య ఘర్షణతో అల్లాడిపోయిన రాష్ట్రం ఆ గాయాల నుంచి కోలుకోకముందే మరో ఘర్షణతో అట్టుడుకుతోంది.
Updated Date - 2023-09-30T15:28:39+05:30 IST