ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manipur violence case: నత్తనడకన విచారణపై సుప్రీంకోర్టు అసహనం

ABN, First Publish Date - 2023-08-01T17:32:24+05:30

మణిపుర్‌ హింస, మహిళలపై జరిగిన అమానుష ఘటనలపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు రెండవ రోజైన మంగళవారంనాడు కూడా విచారణ కొనసాగించింది. ఒకటి, రెండు ఎఫ్ఐఆర్‌లు మినహా ఎవరినీ అరెస్టు చేసినట్టు కనిపించడం లేదని, విచారణ నత్తనడకన సాగుతోందని సీజేఐ డీవై చంద్రచూడ్‌ తో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

న్యూఢిల్లీ: మణిపుర్‌ హింస (Manipur Violence), మహిళలపై జరిగిన అమానుష ఘటనలపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు (Supreme Court) రెండవ రోజైన మంగళవారంనాడు కూడా విచారణ కొనసాగించింది. ఒకటి, రెండు ఎఫ్ఐఆర్‌లు మినహా ఎవరినీ అరెస్టు చేసినట్టు కనిపించడం లేదని, విచారణ నత్తనడకన సాగుతోందని సీజేఐ డీవై చంద్రచూడ్‌ (DY Chandrachud)తో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ప్రధాన కేసును విచారించేంత వరకూ వైరల్ వీడియోలోని ఇద్దరు బాధిత మహిళల నుంచి స్టేట్‌మెంట్ రికార్డులను నిలిపివేయాలని సీబీఐని ఆదేశించింది. మణిపూర్ డీజీపీ కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను జూలై 7వ తేదీకి వాయిదా వేసింది.


కాగా, విచారణ సందర్భంగా మణిపూర్‌లో ఒక మహిళను కారు నుంచి బయటకు లాగి ఆమె కుమారుడిని కొట్టిచంపిన ఘటనను సీజేఐ ప్రస్తావిస్తూ, మే 4న ఈ ఘటన జరిగితే జూలై 7న ఎఫ్ఐఆర్ నమోదైందని అన్నారు. దీనిని బట్టి చూస్తే 1-2 ఎఫ్ఐఆర్‌లు మినహా ఇంతవరకూ ఎలాంటి అరెస్టు జరిగినట్టు కనిపించడం లేదన్నారు. విచారణ చాలా నత్తనడకన జరుగుతోందని అన్నారు. రెండు నెలల తర్వాత ఎఫ్ఐఆర్‌ల నమోదు, స్టేట్‌మెంట్లను రికార్డు చేయడంపై నిలదీశారు.


దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫు హాజరైన సొలిసిటర్ జనరల్ తన వాదనలు వినిపిస్తూ, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం, సంబధిత సంస్థలు చాలా సున్నితంగా డీల్ చేస్తున్నాయని అన్నారు. ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయన్నారు. మహిళలు, పిల్లలపై లైంగిప వేధింపుల సమాచారం తెలిసినప్పుడు అత్యంత సున్నితంగా వ్యహరించాలని అన్ని పోలీస్ స్టేషన్లు, స్టేషన్ అధికారులకు మణిపూర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. గిరిజన మహిళపై అత్యాచారం, హత్య జరిగిన 'కార్ వాష్' ఘటనపై విచారణ జరుగుతోందని, 37 మంది సాక్ష్యులను విచారించామని, మరో 14 మంది కార్‌ వాష్ ఉద్యోగుల విచారణ జరుగుతోందని ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ వివరించారు.


సీజేఐ డీవై చంద్రచూడ్, జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సోమవారం సైతం విచారణ సందర్భంగా కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై అసహనం వ్యక్తం చేసింది. ఇంతవరకూ ఎన్ని ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు? బాధితుల పునరావాసానికి ప్యాకేజీ ప్రకటించారా? అని ప్రశ్నించింది. ఘటనల విచారణకు విస్తృత యంత్రాగం కావాలని పేర్కొంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని బాధితుల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ ధర్మాసనం దృష్టికి తీసుకురాగా, అందుకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉంటే తమ జోక్యం ఉండదని, లేదంటే తామే చొరవ తీసుకోవాల్సి ఉంటుంనది ధర్మాసనం స్పష్టం చేసింది.

Updated Date - 2023-08-01T17:32:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising