ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manipur Violence: సీఎంను ఎందుకు తప్పించలేదో చెప్పిన అమిత్‌షా..!

ABN, First Publish Date - 2023-08-09T21:22:26+05:30

మణిపూర్ హింసాత్మక ఘటనలకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్‌ ను తప్పించకపోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బుధవారంలోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా వివరించారు. ఒక ముఖ్యమంత్రి సహకరించక పోతే ఆయనను తప్పించాల్సిన పరిస్థితి వస్తుందని, కానీ మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ పూర్తిగా కేంద్రానికి సహకరిస్తున్నారని చెప్పారు.

న్యూఢిల్లీ: మణిపూర్ హింసాత్మక ఘటనలకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్‌ (N.Biren singh)ను తప్పించకపోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah) బుధవారంనాడు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా వివరించారు. ఒక ముఖ్యమంత్రి సహకరించక పోతే ఆయనను తప్పించాల్సిన పరిస్థితి వస్తుందని, కానీ మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ పూర్తిగా కేంద్రానికి సహకరిస్తున్నారని చెప్పారు. మణిపూర్ అంశాన్ని విపక్షాలు రాజకీయం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. మణిపూర్ ఘటనలు బాధాకరమని, ఒక రాష్ట్రంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడాన్ని ఎవరూ అంగీకరించరని చెప్పారు. అయితే మణిపూర్‌ అంశంపై చర్చకు ప్రభుత్వం దూరంగా పారిపోతోందంటూ విపక్షాలు దేశాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ నిర్మాణాత్మక చర్చలకు బదులు గందరగోళం సృష్టించేందుకే విపక్షాలు మొగ్గుచూపుతున్నాయని అన్నారు.


పార్లమెంటు సమావేశాల మొదటి రోజు నుంచి మణిపూర్ అంశంపై తాను చర్చకు సిద్ధంగా ఉన్ప్పటికీ విపక్షాలు ఏరోజూ చర్చ సజావుగా జరగాలని కోరుకోలేదన్నారు. విపక్షాలు తన మాట వినాలనుకోవడం లేదని, అయితే తనను మాట్లాడకుండా చేయలేరని, తమను ఎన్నుకున్న 130 కోట్ల మంది ప్రజలే తమ మాట వింటారని అన్నారు. మణిపూర్‌లో మే 3 వరకూ గత ఆరేళ్లలో కర్ఫ్యూ అనే మాటే లేదని, మణిపూర్‌లో హింస తగ్గుముఖం పట్టిందని చెప్పారు. దీనికి విపక్షాలు ఆజ్యం పోయవద్దని కోరారు.


హెలికాప్టర్‌లో రాహుల్‌ను వెళ్లమన్నాం...

హెలికాప్టర్‌లో చురాచాంద్‌పూర్‌ వెళ్లమని రాహుల్ గాంధీకి చెప్పామని, అయితే ఆయన రోడ్డు మార్గాన్నే ఎంచుకున్నారని, దాంతో ఆయనను మణిపూర్ పోలీసులు ఆపారని అమిత్‌షా చెప్పారు. మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణ జరిగినట్టు చెబుతున్న విపక్షాలు మాటలతో తాను ఏకీభవిస్తున్నానని, మణిపూర్ హింస సిగ్గుచేటని, అయితే ఆ అంశాన్ని రాజకీయం చేయాలని చూడటం అంతకంటే సిగ్గుచేటైన వ్యవహారమని అన్నారు.

Updated Date - 2023-08-09T21:22:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising