ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

G20 Summit: ఆ విషయంలో మోదీ ప్రభుత్వానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనూహ్య మద్ధతు..!

ABN, First Publish Date - 2023-09-08T11:56:29+05:30

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వానికి మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అనూహ్య మద్ధతిచ్చారు. శాంతిని ఆకాంక్షిస్తూనే దేశ సార్వభౌమత్వం, ఆర్థిక ఆసక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం సరైదేనని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వానికి మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అనూహ్య మద్ధతిచ్చారు. శాంతిని ఆకాంక్షిస్తూనే దేశ సార్వభౌమత్వం, ఆర్థిక ఆసక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం సరైదేనని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు.

ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో దౌత్యపరంగా భారత్ కఠినమైన సవాలు ఎదుర్కొందని, అయితే సరైన విధానంలోనే నడుచుకుందని మన్మోహన్ సింగ్ ప్రశంసించారు. అయితే దేశీయంగా రాజకీయాల కోసం విదేశీ విధానాన్ని ఉపయోగించుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శనివారం నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా జీ20 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమవనున్న నేపథ్యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మన్మోహన్ సింగ్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.


తాను ప్రధాని మంత్రిగా ఉన్నప్పుడు దేశీయ రాజకీయాలకంటే విదేశీ వ్యవహారాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చామని మన్మోహన్ అన్నారు. పార్టీ రాజకీయాల కోసం విదేశీ విధానాన్ని ఏనాడూ వాడుకోలేదని, ఈ విషయంలో చాలా దూరం పాటించేవాళ్లమని చెప్పారు. రోటేషనల్‌ అవకాశంలో భాగంగా తాను బతికున్న సమయంలో జీ20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని మన్మోహన్ అన్నారు. భారత పాలన విధానంలో విదేశాంగ విధానం చాలా ముఖ్యమైన భాగమన్నారు. అయితే ఈ మధ్య విదేశాంగ విధానం కంటే దేశీయ రాజకీయాలే ఎక్కువయ్యాయన్నారు. కాగా మన్మోహన్ ప్రధానిగా రెండు పర్యాయాలు సేవలు అందించారు. 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వానికి సారధిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కాగా శనివారం జరగనున్న జీ20 విందుకు రాష్ట్రపతి ఆహ్వానించిన వారి జాబితాలో మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2023-09-08T12:05:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising