ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mask: ఇక.. మాస్కులు తప్పనిసరి

ABN, First Publish Date - 2023-04-08T10:59:29+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా పుదుచ్చేరి(Puducherry)లో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ వల్లవన్‌ ఆ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పుదుచ్చేరి: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా పుదుచ్చేరి(Puducherry)లో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ వల్లవన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి పెరిగిపోతుందని, ముఖ్యంగా కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఎక్స్‌బీబీ 1.16(Omicron XBB 1.16) రకం వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు. అందువల్ల ముందస్తు చర్యల్లో భాగంగా, అన్ని బహిరంగ ప్రదేశాలు, పార్కులు, బీచ్‌లు, దేవాలయాలు, మసీదులు, చర్చీలు, బస్టాండులు, మార్కెట్‌ వంటి ప్రదేశాలకు వెళ్ళేవారు విధిగా ముఖానికి మాస్కు(Mask) ధరించాలని ఆయన కోరారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, కంపెనీల్లో పనిచేసే వారంతా కరోనా వ్యాక్సిన్‌ టీకా వేయించుకుని ఉండాలని, మాస్కులు ధరించి విధులకు హాజరుకావాలని ఆయన కోరారు. ఈ ఆదేశాలు కేంద్ర పాలిత ప్రాంత మంతటికీ వర్తిస్తుందని తెలిపారు. అయితే, ప్రస్తుతం టెన్త్‌ పరీక్షలు జరుగుతున్నందున పరీక్షాహాలును పరీక్షల నిర్వహణ అధికారులు విధిగా శానిటైజేషన్‌ చేయించాలని ఆయన కోరారు.

Updated Date - 2023-04-08T10:59:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising