ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharashtra: కర్ణాటక ఫలితాలతో ఎంవీఏలో నూతనోత్సాహం..పవార్ ఇంట్లో కీలక సమావేశం

ABN, First Publish Date - 2023-05-14T18:38:07+05:30

ముంబై: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడం, కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడం మహారాష్ట్రలోని ''మహా వికాస్ అఘాడి''లో నూతనోత్సాహాన్ని నింపింది. మహారాష్ట్రలో రాబోయే ఎన్నికల్లో బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కోవాలనే దృఢ సంకల్పంతో ఎంపీఏ నేతలు ఆదివారం సాయంత్రం సమావేశమయ్యారు. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడం, కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడం మహారాష్ట్రలోని ''మహా వికాస్ అఘాడి'' (MVA)లో నూతనోత్సాహాన్ని నింపింది. మహారాష్ట్రలో రాబోయే ఎన్నికల్లో బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కోవాలనే దృఢ సంకల్పంతో ఎంపీఏ నేతలు ఆదివారం సాయంత్రం సమావేశమయ్యారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) అధ్యక్షతన ఆయన నివాసంలో నేతలంతా సమావేశమయ్యారు. 'మహా వికాస్ అఘాడి'లో కాంగ్రెస్, ఎన్‌సీ, శివసేన (యూబీటీ) భాగస్వాములుగా ఉన్నాయి.

పవార్ నివాసంలో జరిగిన ఎంవీఏ సమావేశంలో ఆయనతో పాటు శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఆయన వర్గం ఎంపీ సంజయ్ రౌత్, కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, అజిత్ పవార్, బాలాసాహెబ్ థోరట్ తదితర నేతలు పాల్గొన్నారు. 2024 లోక్‌సభ, విధానసభ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ఫార్ములా గురించి ప్రధానంగా నేతలు చర్చించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

మోదీ వేవ్ ముగిసింది..

కాగా, ఎంవీఏ సమావేశానికి ముందు సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. ''మోదీ వేవ్ ముగిసిపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మా వేవ్ (విపక్షాల) నడుస్తోంది. ఇవాల్టి నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల కోసం మా అపరేషన్ మొదలవుతోంది. శరద్ పవార్ అధ్యక్షతన సమావేశం అవుతున్నాం. 2024 ఎన్నికలపై సమావేశంలో చర్చించి, అందుకోసం సన్నాహకాలు మొదలపెట్టనున్నాం'' అని రౌత్ చెప్పారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కూడా రౌత్ శనివారంనాడు ఘాటుగా స్పందించారు. బీజేపీ ఓటమిని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా ఓటమిగా అభివర్ణించారు. కర్ణాటకలో ఏదైతే జరిగిందో 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే ఫలితం పునరావృతమవుతుందని జోస్యం చెప్పారు.

Updated Date - 2023-05-14T18:40:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising