Terror Plot : బెంగళూరులో భారీ ఉగ్ర దాడుల కుట్ర భగ్నం
ABN, First Publish Date - 2023-07-19T10:41:26+05:30
కర్ణాటకలోని బెంగళూరు నగరానికి భారీ ఉగ్ర దాడుల ముప్పు తప్పింది. ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా ఈ ఉగ్ర దాడుల ముప్పును తప్పించాయి. భారీ దాడికి పన్నాగం పన్నిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను నగరంలోని వేర్వేరు చోట్ల నుంచి బుధవారం అరెస్టు చేశాయి.
బెంగళూరు : కర్ణాటకలోని బెంగళూరు నగరానికి భారీ ఉగ్ర దాడుల ముప్పు తప్పింది. ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా ఈ ఉగ్ర దాడుల ముప్పును తప్పించాయి. భారీ దాడికి పన్నాగం పన్నిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను నగరంలోని వేర్వేరు చోట్ల నుంచి బుధవారం అరెస్టు చేశాయి. వీరి నుంచి రకరకాల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి.
సయ్యద్ సుహేల్, ఉమర్, జునెయిద్, ముదసిర్, జాహిద్ బెంగళూరు నగరంలో భారీ ఉగ్ర దాడికి పన్నాగం పన్నినట్లు పోలీసులు తెలిపారు. వీరిని అరెస్టు చేసి, వీరి వద్ద ఉన్న రకరకాల పేలుడు పదార్థాలను, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉగ్రవాద దాడికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు.
అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఉగ్రవాదులు బెంగళూరు నగరంలో భారీ దాడికి తమ ప్రణాళికను అమలు చేయబోతున్న తరుణంలో పట్టుబడ్డారు. జునెయిద్ 2017నాటి హత్య కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ జైలులో జమాతే ఇస్లామీ సంస్థకు చెందిన ఉగ్రవాదితో సంబంధాలు ఏర్పరచుకుని, భారీ కుట్రకు ప్రణాళిక రచించాడు. తాను దేనికైనా సిద్ధమేనని జమాతే ఇస్లామీ సంస్థకు చెందిన ఉగ్రవాదికి జునెయిద్ చెప్పాడు. జమాతే ఇస్లామీ హ్యండ్లర్స్ జునెయిద్‌తోపాటు అతని అనుచరులకు ఉగ్రవాదంలో శిక్షణ ఇచ్చారు. వీరు బహిరంగంగా గృహదహనాలు, వాహనాలకు నిప్పు పెట్టడం వంటివాటిలో శిక్షణ పొందారు. ఈ కుట్రకు సంబంధించిన మరిన్ని వివరాలను రాబట్టేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి :
Vande Bharat Train: వందే భారత్ రైలు వచ్చేస్తోంది.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే...
Updated Date - 2023-07-19T10:41:26+05:30 IST