ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister: ‘అప్పన్‌’ అనే మాటపై ఇంత రాద్ధాంతం అవసరమా?

ABN, Publish Date - Dec 24 , 2023 | 10:25 AM

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ‘అప్పన్‌’ అనే తమిళ పదాన్ని పలికిన తనపై విరుచుకుపడటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర యువజన సంక్షేమం క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి స్టాలిన్‌(Minister Udayanidhi Stalin) పేర్కొన్నారు.

- కేంద్రమంత్రిపై ఉదయనిధి ఆగ్రహం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ‘అప్పన్‌’ అనే తమిళ పదాన్ని పలికిన తనపై విరుచుకుపడటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర యువజన సంక్షేమం క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి స్టాలిన్‌(Minister Udayanidhi Stalin) పేర్కొన్నారు. రాష్ట్రంలో తుఫాను బాధితులను వర్షబాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చాలినంత నిధులు విడుదల చేయకపోవడంపై విలేకరుల అడిగిన ప్రశ్నకు తాను బదులిస్తూ ఎవడబ్బ సొమ్మునో తాను అడుగటం లేదని, రాష్ట్ర ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన నిధులను అడుగుతున్నట్లు పేర్కొన్నానని, అంత మాత్రానికే తాను అబ్బ (తమిళంలో అప్పన్‌) అనే మాట ప్రయోగించినందుకు నిర్మలా సీతారామన్‌ తాను వాడుతున్న భాషా బాగాలేదని, తన తాతగారైన కరుణానిధి ఎంతో హుందాగా మాట్లాడేవారని చెప్పటం వింతగా ఉందన్నారు. పెరియార్‌, అన్నాదురై, కరుణానిధి అడుగుజాడల్లో నడుస్తున్న తాను ఎవరిని కించపరిచే విధంగానో, కేంద్రప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ మాట్లాడలేదని, వరద, వర్షబాధితులను ఆదుకునేందుకు త్వరగా నిధులు విడుదల చేయాలన్న భావంతోనే ఎవడబ్బ సొమ్మునో తాము అడగటం లేదని చెప్పానని ఉదయనిధి వివరణ ఇచ్చారు. తన మాటలో గౌరవభావం లేదని నిర్మలా సీతారామన్‌ భావించినట్లయితే తానిప్పుడు గౌరవనీయులైన ఎవరి తండ్రి సొమ్మునో అడగటం లేదని, ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన నిధులను కోరుతున్నానని తన వ్యాఖ్యలను సవరించుకుంటున్నానని పేర్కొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 10:25 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising