ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister: మంత్రి ఎద్దేవా.. ఆపార్టీలో కుర్చీల కుమ్ములాట మొదలైందిగా...

ABN, First Publish Date - 2023-10-17T12:42:23+05:30

శాసనసభలో బాధ్యతాయుతమైన ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అన్నాడీఎంకే కుర్చీల కోసం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): శాసనసభలో బాధ్యతాయుతమైన ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అన్నాడీఎంకే కుర్చీల కోసం కుమ్ములాటలు సాగిస్తోందని రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Former Chief Minister Karunanidhi) శతజయంతి వేడుకల సందర్భంగా ట్రిప్లికేన్‌, అన్నానగర్‌ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో 300 మందికి విద్యా ఉపకారవేతనాలు, దివ్యాంగులకు స్కూటర్లను పంపిణీ చేశారు. ఆ సందర్భంగా ఏర్పాటైన సభలో ఉదయనిధి ప్రసంగిస్తూ... విద్యార్థుల ఉద్యమాల వల్లే డీఎంకే ఆవిర్భవించిందని, డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొరుగు రాష్ట్రాలను సైతం ఆకట్టుకుంటోందన్నారు. బడి పిల్లల అల్పాహార పథకం తెలంగాణలో అమలు చేయడమే ఇందుకు ఉదాహరణ అన్నారు. ఇదే విధంగా మహిళల సంక్షేమం కోసం డీఎంకే(DMK) పలు పథకాలు ప్రవేశపెట్టిందని, సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహిణులకు ప్రతినెలా రూ.1000 చెల్లింపు, ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్‌, ప్లస్‌-2 చదివిన విద్యార్థినులు డిగ్రీ కోర్సులు చదివేందుకు ప్రతినెలా వారి బ్యాంక్‌ ఖాతాలో రూ.1000 జమ చేసే పథకం సహా సీఎం స్టాలిన్‌ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.

నీట్‌ ప్రవేశపెట్టి విద్యార్థులను వైద్య కోర్సులకు దూరం చేసిన కేంద్రప్రభుత్వం ప్రస్తుతం ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రులలో అదనంగా సీట్లు జారీ చేయడాన్ని అడ్డుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా జీఎస్టీ ప్రకారం రూ.5లక్షల కోట్ల మేరకు పన్నులు వసూలు చేసి కేంద్రానికి పంపితే కేంద్ర ఇప్పటివరకూ రూ.2లక్షల కోట్ల మేరకే నిధులు మంజూరు చేసిందని, అదే సమయంలో రూ.3లక్షల కోట్ల మేరకు పన్నులు వసూలు చేసిన ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి రూ.8లక్షల కోట్ల దాకా నిధులు మంజూరు చేసిందని ఉదయనిధి తెలిపారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే సీట్ల కోసం కుమ్ములాట సాగించిందని విమర్శించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా తాము ప్రతిపాదించే వ్యక్తులకు తగిన చోట ఆశీనులు కావించాలంటూ సీట్ల కోసం పట్టుబట్టడం గర్హనీయమని పేర్కొన్నారు.

Updated Date - 2023-10-17T12:42:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising