ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister: మంత్రి ఉదయనిధి సంచలన కామెంట్స్.. నేను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు

ABN, First Publish Date - 2023-11-10T06:32:16+05:30

ద్రవిడ కళగం నిర్వహించిన సనాతన ధర్మం వ్యతిరేక మహానాడులో ఆ ధర్మానికి వ్యతిరేకంగా తాను చేసిన విమర్శలకు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ద్రవిడ కళగం నిర్వహించిన సనాతన ధర్మం వ్యతిరేక మహానాడులో ఆ ధర్మానికి వ్యతిరేకంగా తాను చేసిన విమర్శలకు ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి9Minister Udayanidhi) స్పష్టం చేశారు. స్థానిక ప్యారీస్‌ కార్నర్‌ రాజా అన్నామలై మండ్రంలో గురువారం జరిగిన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతి వేడుకల్లో డీఎంకే శ్రేణులకు, పారిశుధ్య కార్మికులకు సహాయాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉదయనిధి, పీకే శేఖర్‌బాబు, ఎంపీ దయానిధి మారన్‌, గ్రేటర్‌చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌ ఆర్‌ ప్రియ తదితరులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా మంత్రి ఉదయనిధి మాట్లాడుతూ నగరాన్ని శుభ్రంగా ఉంచటంలో కీలక పాత్ర పోషిష్తున్న పారిశుధ్య కార్మికుల సేవల ప్రశంసనీయమని, వారే లేకుంటే నగరం ఇంత అందంగా ఉండేది కాదన్నారు. ఇక సనాతన ధర్మంపై తాను చేసిన విమర్శలను ఉపసంహరించుకోవాలని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ తదితర పార్టీల నేతలు డిమాండ్‌ చేయడం గర్హనీయమన్నారు. సనాతన ధర్మాన్ని సంపూర్ణంగా నిర్మూలించాలని తాను చేసిన ప్రసంగానికి ఎట్టి పరిస్థితులలో ఎవరికీ క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదన్నారు. సామాజిక న్యాయానికి మద్దతుగా, అన్ని వసతులు అన్ని కులాలవారికీ అందాలన్నదే తన అభిమతమని, సమాజంలో అగ్రవర్ణం, బలహీనవర్గం అంటూ విబేధాలు సృష్టించి, అన్ని సదుపాయాలు ఉన్నతవర్గాలవారికే ఉండాలని తెలిపే సనాతన ధర్మం నేటి సమాజానికి వర్తించదన్నారు. ఈ విషయమై క్షమాపణలు చెప్పకపోతే తనకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనలను పార్టీ శ్రేణులే తిప్పికొడతారని ఆయన అన్నారు.

Updated Date - 2023-11-10T06:32:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising