ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister: మంత్రి వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టులో పిటీషన్‌

ABN, First Publish Date - 2023-09-05T10:45:21+05:30

సనాతన ధర్మం నిర్వీర్యం చేయాలనే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌(CM MK Stalin's son, Minister Udayanidhi Stalin)

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): సనాతన ధర్మం నిర్వీర్యం చేయాలనే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌(CM MK Stalin's son, Minister Udayanidhi Stalin) వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేస్తామని శ్రీరామసేన వ్యవ స్థాపకుడు ప్రమోద్‌ ముతాలిక్‌ వెల్లడించారు. సోమవారం ధారవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బెంగళూరు, ధారవాడ, కలబురగి హైకోర్టు బెంచ్‌లలో కేసు దాఖలు చేస్తామన్నారు. ఉదయనిధి రాజ్యాంగబద్ధమైన బాధ్యతాయుతమైన హోదాలో ఉన్నారన్నారు. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియాలాంటివని వీటిని నాశనం చేయాలని ఉదయనిధి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉదయనిధి ఇంకా కళ్లు తెరవలేదని, ఆ స్థాయికి రాలేదని సనాతన ధర్మానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. దేశంలో శాంతి సందేశం ఇస్తోందన్నారు. సుగంధాన్ని వెదజల్లే గంధపు చెట్టును నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఉదయనిధి రాజకీయ ప్రేరేతంగా వ్యాఖ్యానించారని, అది మీ వ్యవస్థను నాశనం చేస్తుందన్నారు. వెంటనే ఉదయనిధి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో పిటీషన్‌ చేస్తామని హెచ్చరించారు. కాగా ఉడుపి పెజావర మఠాధిపతి విశ్వప్రసన్నతీర్థ స్వామిజీ స్పందిస్తూ ఒక రాష్ట్రానికి మంత్రి హోదాలో కొనసాగుతూ బాధ్యత లేకుండా ఉదయనిధి(Udayanidhi) మాట్లాడారన్నారు. సమాజంలో ఇటువంటి విషబీజాలను విత్తడం సరికాదన్నారు. అందరూ సుఖశాంతులతో ఉం డాలని శతాబ్దాలకాలంగా ఆకాంక్షిస్తున్నదే సనాతనధర్మమన్నారు.

Updated Date - 2023-09-05T10:45:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising