ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister: సామరస్య భావనతో ‘కావేరి’ని విడుదల చేయండి: మంత్రి

ABN, First Publish Date - 2023-09-30T08:17:11+05:30

కావేరి జలాల విడుదల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సామరస్య ధోరణి అవసరమని, పట్టువిడుపులకు పోకుండా కావేరి డెల్టా జిల్లాలకు

చెన్నై: కావేరి జలాల విడుదల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సామరస్య ధోరణి అవసరమని, పట్టువిడుపులకు పోకుండా కావేరి డెల్టా జిల్లాలకు తగినంత జలాలను విడుదల చేయాలని రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌(Minister Durai Murugan) విజ్ఞప్తి చేశారు. నగరంలో శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సెకనుకు 5వేల ఘనపుటుడుగుల చొప్పున జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు, కావేరి నిర్వాహక మండలి ఆదేశాలిచ్చినా కర్ణాటక ప్రభుత్వం ఆ ఉత్తర్వులను ఉల్లఘించడం న్యాయం కాదన్నారు. కావేరి జలాల విడుదలను వ్యతిరేకిస్తూ కర్ణాటకలో రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు ఆందోళనలు జరపడం గర్హనీయమన్నారు. మేట్టూరు డ్యాంలో నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతోందని, ఈ పరిస్థితుల్లో సెకనుకు 5 వేల ఘనపుటడుగుల చొప్పున జలాలను విడుదల చేసినా ప్రయోజనం ఉండదన్నారు. అందువల్ల సెకనుకు 12,500 ఘనపుటడుగుల మేర కావేరి జలాలను విడుదల చేస్తేనే చివరి ఆయకట్టు దాకా జలాలు చేరి పంటలు పండించగలుగుతారని మంత్రి వివరించారు.

Updated Date - 2023-09-30T08:17:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising