ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Udayanidhi: మంత్రి ఉదయనిధి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆయన ఏమనన్నారో తెలిస్తే...

ABN, First Publish Date - 2023-08-04T11:26:05+05:30

ప్రజల వద్దకే పథకాలు తీసుకెళ్లే పాలన ద్రావిడ పాలన అని యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) తెలిపారు.

పెరంబూర్‌(చెన్నై): ప్రజల వద్దకే పథకాలు తీసుకెళ్లే పాలన ద్రావిడ పాలన అని యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) తెలిపారు. చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్‌ యూనియన్‌ కుయిల్‌కుప్పంలో మెడ్రాస్‌ సెంట్రల్‌ రోటరీ సంఘం ఆధ్వర్యంలో రూ.7.50 కోట్లతో టీవీ, ఫ్రిజ్‌, బీరువా సహా పలు వసతులతో సంచార జాతులకు నిర్మించిన 63 గృహాలను మంత్రి ఉదయనిధి ప్రారంభించి, లబ్ధిదారులకు గృహాల తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ... లబ్ధి దారులు తమ పిల్లలను తప్పకుండా పాఠశాలకు పంపించాలని, బాల కార్మికులను చెయ్యొద్దని మంత్రి కోరారు. కార్యక్రమంలో గృహ ప్రాజెక్ట్‌ చైర్మన్‌, పాస్ట్‌ రోటరీ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ కలైమామణి అభిరామి రామనాథన్‌, అధ్యక్షుడు ప్రకాష్‌ విద్యానాఽథన్‌, వీఐటీ వైస్‌ ఛాన్సలర్‌ జి.విశ్వనాథన్‌, చెంగల్పట్టు జిల్లా కలెక్టర్‌ ఏఆర్‌ రాహుల్‌నాఽథ్‌, రోటరీ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ పాస్ట్‌ డైరెక్టర్‌ ఏఎస్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-04T11:26:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising