ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Udayanidhi: ఏం.. మాట్లాడకూడదా.... ‘సనాతనం’పై మాట్లాడుతూనే ఉంటా..

ABN, First Publish Date - 2023-10-07T09:34:33+05:30

‘‘పెరియార్‌, అంబేడ్కర్‌ సనాతనం గురించి మాట్లాడారు. అలాగే పలు పార్టీల నేతలు కూడా ప్రస్తావించారు. వారికన్నా నేనేమీ ఎక్కువగా మాట్లాడలేదు.

- గవర్నర్‌ రాజకీయవేత్తలా వ్యవహరిస్తున్నారంటూ విమర్శ

పెరంబూర్‌(చెన్నై): ‘‘పెరియార్‌, అంబేడ్కర్‌ సనాతనం గురించి మాట్లాడారు. అలాగే పలు పార్టీల నేతలు కూడా ప్రస్తావించారు. వారికన్నా నేనేమీ ఎక్కువగా మాట్లాడలేదు. ఈ విషయాన్ని బీజేపీ దారి మళ్లిస్తోంది. మణిపూర్‌ రాష్ట్రం ఐదు నెలలుగా ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలుసు. ఈ విషయాలు కప్పిపుచ్చుకొనేందుకే సనాతనంపై చర్చ మొదలుపెట్టారు. అయినా సనాతనం గురించి మాట్లాడుతూనే ఉంటా’’ అని రాష్ట్ర క్రీడాభివృద్ధిశాఖ మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) వ్యాఖ్యానించారు. చెన్నైలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ‘నాన్‌ ముదలవన్‌’ పథకంలో భాగంగా 2 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను మంత్రి ఉదయనిధి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన ‘నాన్‌ ముదలవన్‌’ పథకంలో పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు చదువు ముగిసిన అనంతరం ఎలాంటి ఉద్యోగాలకు వెళ్లాలనే మార్గదర్శకాలు తెలియజేస్తుందని పేర్కొన్నారు. గత ఏడాది సీఎం జన్మదినం రోజున ప్రారంభించిన ఈ పథకంలో 13 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ అందించాలని నిర్ణయించామన్నారు. ఈ పథకంలో వేలాదిమంది విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు.

జూన్‌లో 1,500 మందికి, శుక్రవారం మరో 2 వేలమందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని, ఏడాదికి రూ.2.50 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వేతనం పొందేలా ఈ పథకం రూపొందించామని మంత్రి తెలిపారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ - డీఎంకే మధ్య పోటీ అని అన్నామలై ప్రకటించారని మీడియా గుర్తు చేయగా... ఈ విషయాన్ని అన్నాడీఎంకే(AIADMK) నేతల వద్ద ప్రస్తావించాలని సూచించారు. ఎన్నికల్లో పోటీకి తమకు ఎవరైనా ఒక్కటేనని, కాకపోతే డీఎంకేకు ప్రత్యర్థి ఎవరనే విషయమై పలు పార్టీల మధ్య పోటీ నెలకొందన్నారు. అలాగే, రాష్ట్రంలో అంటరానితనం అధికంగా ఉందనే గవర్నర్‌ వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. రాష్ట్ర గవర్నర్‌ ఇతర రాష్ట్రాలకు వెళ్లి చూస్తున్నారా, లేదా అనేది తెలియడం లేదన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే, తమిళనాడులో అంటరానితనం తక్కువేనని, అయినా గవర్నర్‌ తన పని చేయకుండా అనవసరమైన రాజకీయాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఐటీ అధికారులు రోజూ అతిథుల్లాగా డీఎంకే నేతలు, ప్రముఖుల నివాసాలకు వచ్చి వెళ్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.

Updated Date - 2023-10-07T09:34:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising