ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Udayanidhi: రూ.15 లక్షలన్నారు..15 పైసలు కూడా ఇవ్వలేదు!

ABN, First Publish Date - 2023-08-29T08:33:02+05:30

అధికారంలోకి వస్తే నల్లధనం వెలికితీసి ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామని ప్రకటించిన నరేంద్ర మోదీ... ఇప్పటివరకు

- కార్పొరేట్‌ సంస్థలకు రూ.15 లక్షల కోట్ల రుణ మాఫీ

- మోదీ ప్రభుత్వంపై మంత్రి ఉదయనిధి ఫైర్‌

పెరంబూర్‌(చెన్నై): అధికారంలోకి వస్తే నల్లధనం వెలికితీసి ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామని ప్రకటించిన నరేంద్ర మోదీ... ఇప్పటివరకు 15 పైసలు కూడా వేయలేదని క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) విమర్శించారు. సేలంలో ఆదివారం రాత్రి పార్టీ యువజన విభాగం నిర్వాహకుల సమావేశం జరిగింది. మంత్రి కేఎన్‌ నెహ్రూ(Minister KN Nehru) అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉదయనిధి మాట్లాడుతూ... ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ప్రధాని మోదీ(Prime Minister Modi) నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందన్నారు. అదే సమయంలో కార్పొరేట్‌ సంస్థలకు రూ.15 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని ఆరోపించారు. ఇక యువజన విభాగం రెండో మహానాడు డిసెంబరు 17న సేలంలో నిర్వహిస్తామన్నారు. మహానాడు నిర్వహణ, ఏర్పాట్లను మంత్రి నెహ్రూ(Minister Nehru)కు అప్పగించామన్నారు. రాహుల్‌ గాంధీ మళ్లీ పార్లమెంటు సమావేశాలకు హాజరుకావడం ‘ఇండియా’ తొలి విజయమని, ఈ పరంపర పార్లమెంటు ఎన్నికల్లో కొనసాగుతుందని మంత్రి ఉదయనిధి ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-29T08:33:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising