Kolkata Airport : కోల్‌కతా విమానాశ్రయంలో స్వల్ప అగ్ని ప్రమాదం
ABN, First Publish Date - 2023-06-15T08:35:34+05:30
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Netaji Subhash Chandra Bose) అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు కొద్ది సేపట్లోనే మంటలను ఆర్పేశారు. ప్రయాణికుల తనిఖీ కార్యకలాపాలను సజావుగా పునరుద్ధరించారు.
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Netaji Subhash Chandra Bose) అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు కొద్ది సేపట్లోనే మంటలను ఆర్పేశారు. ప్రయాణికుల తనిఖీ కార్యకలాపాలను సజావుగా పునరుద్ధరించారు.
కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇచ్చిన ట్వీట్‌లో, విమానాశ్రయంలోని చెక్-ఇన్ ఏరియా పోర్టల్ డీ వద్ద బుధవారం రాత్రి 9.12 గంటలకు స్వల్పంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలిపింది. స్వల్పంగా మంటలు, పొగ వచ్చినట్లు తెలిపింది. ఈ మంటలను రాత్రి 9.40 గంటలకు పూర్తిగా ఆర్పేసినట్లు తెలిపింది. ప్రయాణికులందరినీ సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు పేర్కొంది. చెక్-ఇన్ ఏరియాలో పొగ వ్యాపించడం వల్ల కాసేపు చెక్-ఇన్ ప్రాసెస్‌ను నిలిపేసినట్లు వివరించింది.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా (Jyotiraditya Scindia) స్పందిస్తూ, కోల్‌కతా విమానాశ్రయం చెక్-ఇన్ కౌంటర్ వద్ద దురదృష్టకర సంఘటన జరిగిందన్నారు అయితే ఇది స్వల్ప అగ్ని ప్రమాదమని తెలిపారు. విమానాశ్రయం డైరెక్టర్‌తో మాట్లాడుతున్నానని, పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. ప్రమాద స్థలం నుంచి ప్రయాణికులందరినీ సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు చెప్పారు. చెక్-ఇన్ ప్రాసెస్ బుధవారం రాత్రి 10.25 గంటలకు పునఃప్రారంభమైందన్నారు. ప్రమాదానికి కారణాలేమిటో త్వరలోనే తెలుసుకుంటామన్నారు.
ఈ ప్రమాదానికి కారణాలేమిటో తెలియదు కానీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విద్యుదాఘాతం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Annamalai: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. అనారోగ్యం కాదు.. అంతా నాటకమే!
Chief Minister: ముఖ్యమంత్రి ఆగ్రహం.. మంత్రిని వేధించారు
Updated Date - 2023-06-15T08:35:34+05:30 IST