ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mizoram: గిరిజన భూములు, అడవుల రక్షణకు బిల్లు తెస్తాం... కాంగ్రెస్ కీలక హామీ

ABN, First Publish Date - 2023-10-28T18:15:47+05:30

మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక హామీనిచ్చింది. కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రాగానే గిరిజన భూములు, అటవీ ప్రాంతాలు, గిరిజన హక్కుల పరిరక్షణ కోసం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తామని హామీ ఇచ్చింది.

ఐజ్వాల్: మిజోరం (Mizoram) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) పార్టీ కీలక హామీనిచ్చింది. కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రాగానే గిరిజన భూములు, అటవీ ప్రాంతాలు, గిరిజన హక్కుల పరిరక్షణ కోసం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తామని హామీ ఇచ్చింది.


మిజోరం పర్యటనలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ శనివారంనాడు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే రాష్ట్రంలోని గిరిజనుల భూములు, అడవులు, హక్కుల పరిరక్షించే బిల్లును ఆమోదిస్తామని చెప్పారు. అడవులు అనేవి ఉమ్మడి జాబితాలో ఉన్నందున, 254(2) అధికరణ ప్రకారం బిల్లును వెంటనే రాష్ట్రపతి ఆమోదానికి పంపుతామన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పూర్తయిన వెంటనే మిజోరంలోని ఎంఎన్ఎఫ్ (MNF) ప్రభుత్వం గిరిజన అటవీ భూముల సంరక్షణకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఉండాల్సిందని, అయితే బీజేపీ ఆడమన్నట్టు ఆడుతున్న కారణంగానే ఎంఎన్ఎఫ్ ఆ పని చేయలేకపోయిందని జైరామ్ రమేష్ విమర్శించింది. బీజేపీ, తాము వేర్వేరని ఎంఎన్ఎఫ్ చెబుతున్నప్పటికీ ఈ రెండూ ఒకే నాణేనికి రెండు ముఖాలు వంటివని అన్నారు. జేపీఎంకు ఒక సిద్ధాంతం కానీ, ఒక కార్యక్రమం కానీ, మిజోరం ప్రజలకోసం ఒక సంస్థ కానీ లేనందున ఈ పని ఎప్పటికీ చేయలేదన్నారు. బీజేపీతో రాజీకి కూడా ఆ పార్టీ సిద్ధమేనన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే గిరిజన భూములు, అడవులు, హక్కుల పరిరక్షణకు బిల్లు తెచ్చి, తక్షణం ఆమోదిస్తామని భరోసా ఇచ్చారు. కాగా, 40 మంది సభ్యులు మిజోరం అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 7న జరుగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - 2023-10-28T18:15:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising