ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MK Stalin: 'షా' వెళ్లిన వెంటనే దాడులు..ముమ్మాటికే బెదిరింపు రాజకీయాలే..!

ABN, First Publish Date - 2023-06-13T20:25:59+05:30

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీ అధికారిక చాంబర్స్‌‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు జరపడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేక దొడ్డిదారిన బీజేపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చైన్నై: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీ (Senthil Balaji) అధికారిక చాంబర్స్‌‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు జరపడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేక దొడ్డిదారిన బీజేపీ (BJP) బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం ద్వారా రాజకీయ ప్రత్యర్థులను తన కంట్రోల్‌లో పెట్టుకోవాలని బీజేపీ చూస్తోందని, దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ తరహా దాడులు జరుగుతుండటమే ఇందుకు ఉదాహరణ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

''ఏ తరహా విచారణకైనా పూర్తి సహకారం అందిస్తానని సెంథిల్ బాలాజీ చెప్పారు. అలాంటప్పుడు సెక్రటేరియట్ ఆవరణలోని మంత్రి అధికారిక ఛాంబర్స్‌పై ఈడీ దాడులు చేయాల్సిన అవసరం ఏముంది? సెక్రటేరియట్‌పై దాడి చేయగల సామర్థ్యం, బెదిరించే సత్తా తమకుందని నిరూపించుకునేందుకే ఈదాడులు జరిపినట్టు కనిపిస్తోంది'' అని స్టాలిన్ అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. హోం మంత్రి అమిత్‌షా చెన్నై వచ్చి వెళ్లిన వెంటనే ఈ దాడులు జరపడంలో ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. అమిత్‌షా తన ప్రసంగంలో డీఎంకే పైన, ప్రభుత్వం పైన చాలా విమర్శలు చేశారని, తాము సైతం అందుకు స్పష్టమైన వివరణ ఇచ్చామని చెప్పారు. సెక్రటేరియట్‌పై దాడులు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. బీజేపీ బెదరింపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని స్టాలిన్ హెచ్చరించారు.

Updated Date - 2023-06-13T20:25:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising