ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Modi and Adani : మోదీ ప్రజాదరణపై అదానీ దెబ్బ!

ABN, First Publish Date - 2023-02-11T12:17:20+05:30

అదానీ గ్రూప్ ఆగడాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మద్దతు ఉందనే ఆరోపణల నేపథ్యంలో

Narendra Modi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ ఆగడాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మద్దతు ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఆయనకు ప్రజాదరణ తగ్గిందో, పెరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంది. షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ (Gautam Adani) ఆర్థిక సామ్రాజ్యం అతలాకుతలమవుతున్న తరుణంలో మోదీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఓ సర్వే జరిగింది. శుక్రవారం విడుదలైన అప్రూవల్ రేటింగ్స్‌లో మోదీకి వ్యతిరేకంగా ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఆయనకు ప్రజాదరణ తగ్గలేదని స్పష్టమవుతోంది.

అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ (Hindenburg) జనవరి 24న గౌతమ్ అదానీ నేత‌‌‌‌‌ృత్వంలోని అదానీ గ్రూప్ స్టాక్ మేనిపులేషన్, అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతోందని ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, బీఆర్ఎస్ వంటి ప్రతిపక్ష పార్టీలు మోదీకి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నాయి. అదానీ గ్రూప్‌పై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంటు కార్యకలాపాలను స్తంభింపజేయడంతోపాటు వీథి పోరాటాలు కూడా చేస్తున్నాయి. అదానీని కాపాడటానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, నిష్పక్షపాత దర్యాప్తునకు ఆదేశించడం లేదని ఆరోపిస్తున్నాయి. ఈ ఏడాదిలో తొమ్మిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరగవలసి ఉంది, వచ్చే సంవత్సరం లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి.

పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మోదీ సమాధానం చెప్తూ, దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఆశీర్వాదాలే తనకు రక్షణ కవచమని చెప్పారు. అబద్ధాలతో, దూషణలతో తనను నాశనం చేయలేరన్నారు. ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘‘అదానీ, అదానీ’’ అంటూ గందరగోళం సృష్టించారు.

ఈ నేపథ్యంలో సీ-ఓటర్ నిర్వహించిన సర్వేలో మోదీకి మద్దతు తగ్గలేదని వెల్లడైంది. అయితే ఈ సర్వేలో అదానీ అంశాన్ని ప్రస్తావించలేదు. ఫిబ్రవరి 5 వరకు ఈ సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు సగం మంది వరకు మోదీ పనితీరు పట్ల గొప్ప సంతృప్తి వ్యక్తం చేశారు. కొంత వరకు సంతృప్తి చెందామని సుమారు 30 శాతం మంది చెప్పారు. 2022 నవంబరులో వెల్లడైన సర్వే ఫలితాలు కూడా దాదాపు ఇదే విధంగా ఉన్నాయి.

సీ-ఓటర్, ‘ఇండియా టుడే’ మూడ్ ఆఫ్ ది నేషన్ ఒపీనియన్ పోల్‌ ఫలితాలు జనవరిలో వెల్లడయ్యాయి. దీనిలో 72 శాతం మంది మోదీ పనితీరును మెచ్చుకున్నారు. గత ఏడాది ఆగస్టులో ఈ ఒపీనియన్ పోల్‌లో మోదీ పనితీరును 66 శాతం మంది మెచ్చుకున్నారు.

Updated Date - 2023-02-11T12:17:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising