ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM Modi: సనాతనం విధ్వంసమే ‘ఇండియా’ ధ్యేయం

ABN, First Publish Date - 2023-09-15T03:59:42+05:30

విపక్షాల ‘ఇండియా(India)’ కూటమిని ‘ఘమండియా (గర్వపోతుల కూటమి)’ అని ప్రధాని మోదీ(PM MODI) మరోసారి విమర్శించారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తోందని విరుచుకుపడ్డారు. తద్వారా దేశాన్ని వెయ్యేళ్ల బానిసత్వంలోకి నెట్టాలనుకుంటోందని ధ్వజమెత్తారు.

దేశాన్ని వెయ్యేళ్ల బానిసత్వంలోకి నెట్టాలనుకుంటున్నారు

దీనిని అడ్డుకోవాలి.. ఐక్యంగా ఉంటేనే ఇది సాధ్యం

జీ20 విజయంతో భారతీయులు తలెత్తుకు తిరుగుతున్నారు

ఈ ఘనత నాది కాదు.. 140 కోట్ల భారతీయులది: మోదీ

మధ్యప్రదేశ్‌లో రూ.49 వేల కోట్లతో పెట్రోకెమికల్‌

కాంప్లెక్స్‌కు ప్రధాని శంకుస్థాపన

బీనా, సెప్టెంబరు 14: విపక్షాల ‘ఇండియా(India)’ కూటమిని ‘ఘమండియా (గర్వపోతుల కూటమి)’ అని ప్రధాని మోదీ(PM MODI) మరోసారి విమర్శించారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తోందని విరుచుకుపడ్డారు. తద్వారా దేశాన్ని వెయ్యేళ్ల బానిసత్వంలోకి నెట్టాలనుకుంటోందని ధ్వజమెత్తారు. డీఎంకే నేతలు(DMK Leaders) కొద్ది రోజులుగా సనాతన ధర్మంపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నవంబరు-డిసెంబరుల్లో అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) జరుగనున్న మధ్యప్రదేశ్‌లోని బీనా రిఫైనరీలో రూ.49 వేల కోట్ల పెట్టుబడితో తలపెట్టిన పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌కు, మరో పది ప్రాజెక్టులకు ప్రధాని గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘ఘమండియా కూటమి ఇటీవల ముంబైలో సమావేశమైంది. వారికి ఎలాంటి విధానాల్లేవు.


లేవనెత్తడానికి అంశాల్లేవు.. కనీసం నాయకుడు కూడా లేడు. సనాతన ధర్మంపై దాడి వెనుక వారికి రహస్య ఎజెండా ఉంది. ఈ ధర్మాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్నారు. మహాత్మాగాంధీ సనాతన ధర్మం నుంచే స్ఫూర్తి పొందారు. ఆయన స్వాతంత్య్ర పోరాటం మొత్తం దాని చుట్టూనే తిరిగింది. జీవిమంతా ఈ ధర్మాన్నే అనుసరించారు. హే రామ్‌ అనేవి ఆయన చివరి మాటలు. ఇండోర్‌ పాలకురాలు అహల్యాబాయి హోల్కర్‌, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, స్వామి వివేకానంద, లోకమాన్య తిలక్‌కు కూడా సనాతన ధర్మమే స్ఫూర్తి. అలాంటి ధర్మానికి వ్యతిరేకంగా విపక్షాలు బహిరంగంగానే దాడి మొదలుపెట్టాయి. మనపై దాడిని మరింత తీవ్రంగా చేయబోతున్నాయి. దేశం నలుమూలలా సనాతన ధర్మాన్ని అవలంబించే ప్రతి ఒక్కరూ, దేశ ప్రేమికులంతా అప్రమత్తంగా ఉండాలి. ఈ శక్తులను అడ్డుకోవాలి. ఐకమత్యంగా ఉంటే వీటి ప్రయత్నాలను తిప్పికొట్టగలం’ అని స్పష్టం చేశారు. జి-20 సదస్సు విజయంతో ప్రతి భారతీయుడూ తలెత్తుకుని తిరుగుతుతున్నాడని.. వారి గుండెలు గర్వంతో ఉప్పొంగుతున్నాయని చెప్పారు. ‘ఈ ఘనత మోదీది కాదు.. 140 కోట్ల మంది భారతీయులది. గ్రామాల్లోని ప్రతి పిల్లవాడికీ ఈ సదస్సు గురించి తెలుసు. వారి ఆత్మవిశ్వాసాన్ని ఇది పెంపొందించింది. సమష్టి కృషితోనే విజయం సాధ్యపడింది’ అని తెలిపారు.

అవినీతిని రూపుమాపాం

మధ్యప్రదేశ్‌ను సుదీర్ఘకాలం పాలించినవారు (కాంగ్రెస్‌).. రాష్ట్రానికి ఏమీ చేయలేదని మోదీ ధ్వజమెత్తారు. అవినీతి, నేరాల్లో కూరుకుపోయారని, రాష్ట్రంలో నేరగాళ్లే రాజ్యమేలారని ఆరోపించారు. అయితే బీజేపీకి అవకాశమిచ్చాక అవినీతి, అరాచకాలను రూపుమాపామన్నారు. వాతావరణం మారడంతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారని ఆయన తెలిపారు.

ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మండిపడింది. ’ఇంత దిగజారుడుతనం చూశాక ఆయన గందా (మురికి) కూటమికి సారథ్యం వహిస్తున్నారని ఎవరైనా చెప్పేస్తారు. జీఏ-ఎన్‌డీఏ (గందా) అంటే గౌతమ్‌ అదానీకి చెందిన ఎన్‌డీఏ అని అర్థం’ అని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’లో ధ్వజమెత్తారు.

Updated Date - 2023-09-15T05:16:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising