ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Asadudding Owaisi: ఒక పద్ధతి ప్రకారం ముస్లింలను టార్గెట్ చేస్తున్నారు

ABN, First Publish Date - 2023-02-17T16:44:10+05:30

హర్యానాలోని భివానిలో ఇద్దరు ముస్లిం యువకులు హత్యకు గురికావడంపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: హర్యానాలోని భివాని (Bhiwani)లో ఇద్దరు ముస్లిం యువకులు హత్యకు గురికావడంపై ఏఐఎంఐఎం (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asadudding Owaisi) బీజేపీపై విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలను ఒక పద్ధతి ప్రకారం టార్గెట్ చేస్తున్నారని అన్నారు. ముస్లిం యువకుల హత్య అమానవీయ చర్య అని, బీజేపీ-ఆర్ఎస్ఎస్ మద్దతున్న గో-రక్షకుల ముఠానే ఈ పనికి పాల్పడిందని ఆయన ఆరోపించారు.

''హర్యానాలోని జునైద్, నసిర్ అనే వ్యక్తులను ఆర్గనైజ్డ్ గ్యాంగ్ పాశవికంగా చంపడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న మోను అనే వ్యక్తికి హర్యానా బీజేపీ ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది. ఈ ఘటనకు వాళ్లే బాధ్యులు. ఈ ఘటనపై ప్రధాని, హోం మంత్రి మాట్లాడతారా?" అని భివానీ ఘటనపై ఒవైసీ ట్వీట్ చేశారు. కేంద్రం కానీ, హర్యానాలోని బీజేపీ సర్కారు కానీ ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తులను రక్షించడం, ప్రోత్సహించడం చేయరాదని అన్నారు.

ఘటన వివరాలు...

కాగా, దీనికి ముందు రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లా నుంచి ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ అయ్యారు. గోరక్షణ సభ్యులుగా చెబుతున్న ఇద్దరు వీరిని అపహరించుకుని వెళ్లినట్టు చెబుతున్నారు. కిడ్నాప్ అయిన ఇద్దరు వ్యక్తులు మంగళవారంనాడు ఒక కారులో మాడిమసై కనిపించారు. ఢిల్లీకి 100 కిలోమీటర్ల దూరంలోని రాజస్థాన్-హర్యానా సరిహద్దులో ఈ ఘటన జరిగింది. కిడ్నాప్ చేసిన యువకులను కారులోనే ఉంచి కారుకు నిప్పుపెట్టి చంపేసినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయని, అయితే కారు లైసెన్స్ నంబర్‌ను బట్టి మృతులను గుర్తించామని జునైద్ కుటుంబ సభ్యులు తెలిపారు. భజరంగ్ దళ్ (గోరక్షకులు) సభ్యులు కొందరు ఈ కిడ్నాప్ జరిపినట్టు వారు ఆరోపించారు. భరత్ పూర్‌ పోలీసులు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద నిందితులు లోకేష్, రింకూ షైని, శ్రీకాంత్, మోను మనెసార్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, కారుకు నిప్పు పెట్టడం వళ్ల మరణించారా, ప్రమాదంలో మరణించారా అనేది ఇంకా స్పష్టం కాలేదని డీఎస్‌పీ జగత్ సింగ్ లోహరు తెలిపారు.

Updated Date - 2023-02-17T16:44:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising