Rahul Gandhis house:నా ఇల్లు రాహుల్ గాంధీకి అంకితం...వరణాసి కాంగ్రెస్ నేత పోస్టర్
ABN, First Publish Date - 2023-03-29T10:37:46+05:30
ఎంపీ రాహుల్ గాంధీ అనర్హత వేటుతోపాటు ఢిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసు జారీ చేయడంతో పలువురు కాంగ్రెస్ నేతలు ఆయన సంఘీభావం...
న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో సూరత్ కోర్టు జైలు శిక్ష విధింపుతో ఎంపీ రాహుల్ గాంధీ అనర్హత వేటుతోపాటు ఢిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసు జారీ చేయడంతో పలువురు కాంగ్రెస్ నేతలు ఆయన సంఘీభావం(Congress leaders solidarity) ప్రకటించారు.(Rahul Gandhis house) ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఏప్రిల్ 22వతేదీలోగా ఢిల్లీలోని లుటియన్స్‌లోని తన అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని లోక్‌సభ హౌసింగ్ కమిటీ తొలగింపు నోటీసు జారీ చేసింది.
ఇది కూడా చదవండి : Karnataka assembly poll: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలు నేడు ఖరారు
దీంతో పలువురు కాంగ్రెస్ నేతలు రాహుల్ కు మద్ధతుగా నిలిచారు. వరణాసి నగరానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు అజయ్ రాయ్ స్థానికంగా ఉన్న తన పూర్వీకుల ఇంటిని రాహుల్ గాంధీకి అంకితం చేసి స్వాగతం పలికారు.(My house is Rahul Gandhis house) అజయ్ రాయ్ దంపతులు వారి ఇంటి బయట గోడకు ‘‘మేరా ఘర్ శ్రీ రాహుల్ గాంధీజీకా ఘర్’’ అంటూ ఆయన ఫొటోతో నేమ్ ప్లేటు పెట్టారు.
Updated Date - 2023-03-29T10:40:11+05:30 IST