ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

New Parliament: పార్లమెంటు హాలులో సావర్కర్‌కు ఘనంగా నివాళులు

ABN, First Publish Date - 2023-05-28T16:05:26+05:30

కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం రోజే వీడీ సావర్కర్ జయంతి కూడా రావడంతో పాత పార్లమెంటులోని సెంట్రల్ హాలులో సావర్కర్ చిత్రపటానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించారు.

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం రోజే వీడీ సావర్కర్ (VD savarkar) జయంతి కూడా రావడంతో పాత పార్లమెంటులోని సెంట్రల్ హాలులో సావర్కర్ చిత్రపటానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించారు. మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వీర సావర్కర్ స్ఫూర్తి...

వీర సావర్కర్ త్యాగం, సాహసం, దృఢదీక్ష మనకు నిరంతర స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధాన మంత్రి "మన్ కీ బాత్'' కార్యక్రంలో కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధుడైన వీర సావర్కర్ జయంతి ఈరోజు అని, సావర్కర్‌ జైలు జీవితం అనుభవించిన అండమాన్ జైలును దర్శించేందుకు తాను వెళ్లిన రోజు నేటికీ మరిచిపోలేనని అన్నారు. నిర్భీతికి, ఆత్మగౌరవానికి ప్రతీక సావర్కర్ అని, బానసిత్వ ఆలోచనా విధానాన్ని ఆయన సహించేవారు కాదని అన్నారు. కేవలం స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా, సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం కోసం సావర్కర్ విశేషంగా కృషి చేశారని కొనియాడారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిందీలో చేసిన ట్వీట్‌లో, వీడీ సావర్కర్ తన ఆలోచనలతో అసంఖ్యాక భారతీయుల గుండెల్లో దేశ భక్తి ద్వీపాలను వెలిగించారని తెలిపారు. ఆయన దేశ భక్తి, త్యాగం, పట్టుదల ప్రశంసనీయమనని అన్నారు. ఆ గుణాలు భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు.

Updated Date - 2023-05-28T16:06:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising