ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mann Ki Baat : మొబైల్ పేమెంట్ సిస్టమ్‌పై మోదీ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-02-26T15:21:10+05:30

మన దేశంలో వినియోగిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) విధానం పట్ల ప్రపంచ దేశాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : మన దేశంలో వినియోగిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) విధానం పట్ల ప్రపంచ దేశాలు ఆకర్షితులవుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ఆయన ప్రతి నెలా నిర్వహించే రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ఆదివారం మాట్లాడుతూ, డిజిటల్ ఇండియాకు అద్భుతమైన ఉదాహరణలు యూపీఐ సిస్టమ్, ఈ-సంజీవని యాప్ (e-Sanjeevani App) అని తెలిపారు.

‘‘భారత దేశ యూపీఐ పట్ల ప్రపంచంలోని చాలా దేశాలు ఆకర్షితులవుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే UPI-PayNow Linkను భారత్-సింగపూర్ మధ్య ప్రారంభించాం. ఇప్పుడు ఇరు దేశాల్లోని ప్రజలు తమ తమ దేశాల్లో ఏ విధంగా సొమ్మును బదిలీ చేసుకుంటున్నారో, అదే విధంగా తమ మొబైల్ ఫోన్ల ద్వారా (ఒక దేశం నుంచి మరొక దేశానికి) లావాదేవీలు జరుపుకోగలుగుతున్నారు’’ అని తెలిపారు.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఈ-సంజీవని యాప్ గొప్ప వరం అని రుజువైందన్నారు. డిజిటల్ ఇండియా శక్తి, సామర్థ్యాలకు ఇది గొప్ప ఉదాహరణ అని తెలిపారు. అస్వస్థతతో బాధపడేవారు ఎంతో దూరంలో ఉంటూనే, ఈ యాప్ ద్వారా వైద్యుడిని సంప్రదించవచ్చునని చెప్పారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా వైద్య సలహాలు పొందవచ్చునని చెప్పారు. ఈ యాప్‌ను ఉపయోగిస్తున్న టెలికన్సల్టెంట్ల సంఖ్య 10 కోట్లు దాటిందన్నారు. రోగి-వైద్యుడు మధ్య ఏర్పడే ఈ అద్భుతమైన అనుబంధం చాలా గొప్ప విజయమని తెలిపారు. ఈ సదుపాయాన్ని పొందుతున్న అందరు వైద్యులు, రోగులను తాను అభినందిస్తున్నానని తెలిపారు. భారతీయులు టెక్నాలజీని తమ జీవితాల్లో ఏ విధంగా భాగం చేసుకున్నారో చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యమని తెలిపారు. ఈ-సీజీవని యాప్ (e-Sanjeevani App) ద్వారా ప్రయోజనం పొందిన ఉత్తర ప్రదేశ్‌వాసితో మోదీ మాట్లాడారు.

భారతీయ ఆట బొమ్మలు, కథలు చెప్పే విధానంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోందని మోదీ తెలిపారు. ప్రజా భాగస్వామ్యానికి మంచి వేదికగా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రజలు తీర్చిదిద్దారని తెలిపారు. భారతీయ ఆట బొమ్మల గురించి తాను ఈ కార్యక్రమంలో చెప్పానని, ప్రజలు వీటిని కూడా ప్రోత్సహించారని తెలిపారు. భారతీయులు కథలు చెప్పే విధానాన్ని ఈ కార్యక్రమంలో చెప్పిన తర్వాత విస్తృతంగా ప్రచారం జరిగిందన్నారు. దీని పట్ల మరింత ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారన్నారు.

ఇవి కూడా చదవండి :

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వోద్యోగులకు తీపి కబురు

Jammu and Kashmir : పుల్వామాలో టార్గెట్ కిల్లింగ్... కశ్మీరీ పండిట్ హత్య...

Updated Date - 2023-02-26T15:21:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising