కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

National Herald case: స్వాతంత్ర్యోద్యమాన్ని ధన రూపంలో మార్చుకుంటున్న కాంగ్రెస్: రవిశంకర్ ప్రసాద్

ABN, First Publish Date - 2023-11-22T18:16:40+05:30

నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యాలను బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ (Ravishankar Prasad) తిప్పికొట్టారు. స్వాతంత్ర్యోద్యమాన్ని, దానితో ముడిపడిన నేషనల్ హెరాల్డ్ పేపర్ ఆస్తులను కాంగ్రెస్ ధన రూపంలో మార్చుకుని వినియోగించుకుంటోందని ప్రత్యారోపణ చేశారు.

National Herald case: స్వాతంత్ర్యోద్యమాన్ని ధన రూపంలో మార్చుకుంటున్న కాంగ్రెస్: రవిశంకర్ ప్రసాద్

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసు (National Herala case)లో మళ్లీ కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యాలను బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ (Ravishankar Prasad) తిప్పికొట్టారు. స్వాతంత్ర్యోద్యమాన్ని, దానితో ముడిపడిన నేషనల్ హెరాల్డ్ పేపర్ ఆస్తులను కాంగ్రెస్ ధన రూపంలో మార్చుకుని వినియోగించుకుంటోందని ప్రత్యారోపణ చేశారు. విపక్షాన్ని (కాంగ్రెస్) ప్రభుత్వం వెంటాడి వేధిస్తోందంటూ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని అన్నారు. చట్టవిరుద్ధ విధానాలతో కాంగ్రెస్ వ్యాపారం చేస్తోందని బుధవారనాడిక్కడ బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మట్లాడుతూ అన్నారు.


నిజాయితీ లోపించిన వారిపైన, ప్రజాధనాన్ని దోచుకున్న వారిపైన చర్య తీసుకోవడం ప్రజాస్వామాన్ని ఖూనీ చేయడం ఎలా అవుతుందని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని రవిశంకర్ ప్రసాద్ సూటిగా ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులను గాంధీ కుటుంబం దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు. స్వాంతంత్ర్య ఉద్యమాన్ని కాంగ్రెస్ ధనరూపంలోకి మార్చుకుని వినియోగించుకోవడంతో పాటు అందుకు అనుగుణంగా ఆనువంశిక పాలన నడుపుతోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబం తమ తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.

Updated Date - 2023-11-22T18:16:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising