ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Supreme court: మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్ మాలిక్‌కు తాత్కాలిక బెయిల్

ABN, First Publish Date - 2023-08-11T17:25:47+05:30

మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్‌ కు వైద్య కారణాల రీత్యా రెండు నెలల పాటు సుప్రీంకోర్టు శుక్రవారంనాడు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. మనీలాండరింగ్ కేసు కింద 2022 ఫిబ్రవరిలో ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.

న్యూఢిల్లీ: మహారాష్ట్ర (Maharashtra) మాజీ మంత్రి, నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నేత నవాబ్ మాలిక్‌ (Nawab malik)కు వైద్య కారణాల రీత్యా రెండు నెలల పాటు సుప్రీంకోర్టు శుక్రవారంనాడు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అజ్ఞాత నేరప్రపంచ నేత దావూడ్ ఇబ్రహీం, ఆయన అనుచరుల కార్యకలాపాలతో సంబంధం ఉందన్న ఆరోపణలపై మనీలాండరింగ్ కేసు కింద 2022 ఫిబ్రవరిలో నవాబ్ మాలిక్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


కిడ్నీ సమస్యతో పాటు పలు ఆరోగ్య సమస్యలు ఉన్నందున తనకు బెయిలు ఇవ్వాలని ముంబై హెకోర్టును నవాబ్ మాలిక్ ఇటీవల కోరారు. అయితే, ఆయనకు ప్రత్యేకమైన వైద్య సహాయం అందుతున్నందున ఆయన జీవించే హక్కుకు ఎలాంటి భంగం కలగడం లేదని పేర్కొంటూ గత జూలైలో హైకోర్టు బెయిల్ నిరాకరించింది. కాగా, నవాబ్ మాలిక్ ఆరోగ్య పరిస్థితి గత కొద్ది నెలలుగా క్షీణిస్తోందని, కిడ్నీ సమస్యకు సంబంధించి ఆయన స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3కి చేరుకున్నారని ఆయన లీగల్ టీమ్ సుప్రీంకోర్టులో వాదించింది. దీనిని పరిగణలోకి తీసుకున్న జస్టిస్ అనురుద్ధ బోస్, బీఎం త్రివేదితో కూడిన సుప్రీం ధర్మాసనం ఆయనకు రెండు నెలల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. కేసు పూర్వాపరాల జోలికి వెళ్లకుండా కేవలం వైద్య కారణాల వల్లే తాత్కాలిక బెయిల్ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది.

Updated Date - 2023-08-11T18:15:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising