ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Opposition Meet: విపక్షాల సమావేశానికి పవార్ హాజరుపై తొలిగిన సస్పెన్స్..!

ABN, First Publish Date - 2023-07-17T14:50:26+05:30

బెంగళూరులో జరుగుతున్న రెండ్రోజుల విపక్ష పార్టీల సమావేశంలో ఎన్‌సీపీ నేత శరద్ పవార్ హాజరుపై అనిశ్చితి తొలగింది. సోమవారం కాకుండా మంగళవారం జరిగే సమావేశంలో పవార్ హాజరవుతారని ఎన్‌సీపీ తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు విపక్ష రాజకీయాల పార్టీలు బెంగళూరు (Bengaluru)లో సమావేశమవుతున్నాయి. సోమ, మంగళవారాల్లో జరిగే ఈ సమావేశాల్లో 24 పార్టీల నేతలు పాల్గొంటున్నారు. అయితే, ప్రతిపక్షల ఉమ్మడి కూటమి ప్రయత్నాల్లో మొదట్నించీ చురుకుగా ఉన్న నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) వ్యవస్థాపకుడు శరద్ పవార్ (Sharad Pawar) సొంత పార్టీలో తలెత్తిన తిరుగుబాటు నేపథ్యంలో బెంగళూరు సమవేశానికి హాజరకాకపోవచ్చనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, దీనిపై ఎన్‌సీపీ తాజగా స్పష్టత ఇచ్చింది. శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలే మంగళవారంనాడు విపక్షాల భేటీలో పాల్గొంటారని ఆ పార్టీ ప్రతినిధి మహేష్ తపసే ఓ ట్వీట్‌లో తెలిపారు.


అసెంబ్లీ సమవేశాలు ప్రారంభం కావడంతోనే..

కాగా, శరద్ పవార్ మంగళవారంనాడు విపక్షాల సమావేశానికి హాజరవుతారని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సోమవారంనాడు మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నందున పవార్ తన ఎమ్మెల్యేలతో సమావేశం కావాల్సి ఉందన్నారు.


కాగా, బెంగళూరులోని తాజ్ వెస్ట్‌ఎండ్ హోటల్‌ విపక్ష నేతలు సమావేశానికి వైదికైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సాయంత్రం 6 గంటలకు చేసే ప్రసంగంతో సమావేశం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు 24కు పైగా ప్రతిపక్షాల నేతలు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. సమావేశాల అనంతరం విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. తిరగి మంగళవారం మధ్యాహ్నం 11 గంటలకు సమావేశాలు కొనసాగుతాయి. కనీస ఉమ్మడి కార్యక్రమానికి ఉప సంఘం ఏర్పాటు చేయడం, రాష్ట్రాల వారిగా సీట్ల సర్దుబాటు అంశం, కూటమి పేరు వంటివి ఈ సమావేశాల్లో నిర్ణయిస్తారని తెలుస్తోంది. పాట్నా సమావేశం విజయవంతం కావడంతో బెంగళూరులో జరిగే రెండ్రోజుల సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

Updated Date - 2023-07-17T15:05:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising