ED summons: అక్రమాల కేసులో ఎన్సీపీ నాయకుడు జయంత్ పాటిల్‌కు ఈడీ సమన్లు
ABN, First Publish Date - 2023-05-11T09:44:25+05:30
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం సమన్లు జారీ చేసింది....
ముంబయి: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం సమన్లు జారీ చేసింది.(ED summons) ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(IL&FS case) అక్రమాల కేసులో జయంత్ పాటిల్(NCP leader Jayant Patil) మే 12వతేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లలో పేర్కొంది. గతంలో మనీలాండరింగ్ కేసులో రాజ్ థాకరేను ఈడీ ప్రశ్నించింది. డిఫాల్టర్లలో ఒకటైన కోహినూర్ లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రుణం, పెట్టుబడుల్లో అవకతవకలు జరిగాయని ఈడీ దర్యాప్తు చేస్తోంది.
Updated Date - 2023-05-11T09:44:51+05:30 IST