ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

New terminal: కొత్త టెర్మినల్‌ రెడీ.. రేపు ప్రధానిచే ప్రారంభం

ABN, First Publish Date - 2023-04-07T08:07:36+05:30

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.1260 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త అధునాతన టెర్మినల్‌(Terminal) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- 20 వేల మంది పోలీసులతో ఐదంచెల భద్రత

చెన్నై, (ఆంధ్రజ్యోతి): చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.1260 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త అధునాతన టెర్మినల్‌(Terminal) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 1,36,295 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమైన టి-2 మొదటి విడత భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 8వ తేదీన ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం కొత్త టెర్మినల్‌ సిద్ధమైంది. ఈ టెర్మినల్‌ ప్రారంభమైతే ఏడాదికి 23 మిలియన్ల నుంచి 30 మిలియన్లకు ప్రయాణీకుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణభారతదేశం కట్టుబొట్టు, సంప్రదాయాలు తెలిసొచ్చేలా టెర్మినల్‌ లోపలి భాగంలో గోడలపై బొమ్మలు చిత్రీకరించారు. అత్యాధునిక సదుపాయాలు కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) సైతం ఈ టెర్మినల్‌ నిర్మాణ కౌశలాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు ఆయన గురువారం ట్విట్టర్‌లో ప్రశంసలు గుప్పించారు. ‘‘ఈ టెర్మినల్‌ ప్రారంభోత్సవంతో ప్రయాణీకులకు వసతులు, మౌలిక సదుపాయాలు మెరుగవుతాయి. సుందరమైన టెర్మినల్‌. ఇది నగర ఆర్థికాభివృద్ధికి మరింత ఊతమిస్తుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు.

20 వేల మంది పోలీసులతో ఐదంచెల భద్రత

ప్రధాని పర్యటనను పురస్కరించుకుని 20 వేల మంది పోలీసులతో ఐదెంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి నగరానికి రానున్న ప్రధాని.. రాత్రి 8 గంటల వరకు ఇక్కడే ఉంటారు. విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ ప్రారంభోత్సవం, చెన్నై సెంట్రల్‌లో వందేభారత్‌ రైలు(Vande Bharat train) ప్రారంభోత్సవం, మైలాపూర్‌లోని శ్రీరామకృష్ణ మఠం 125వ వార్షికోత్సవాలు, పల్లావరంలోని ‘అల్‌స్టామ్‌ ఇంగ్లీష్‌ ఎలక్ర్టికల్స్‌ ఫ్యాక్టరీ’లో జరిగే అభివృద్ధి కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్న విషయం తెలిసిందే. అదేరోజు కర్ణాటకకు వెళ్లనున్న ప్రధాని మరునాడు నీలగిరి జిల్లా ముదుమలైలోని ఏనుగుల సంరక్షణాలయ సందర్శన కోసం రానున్నారు. దీంతో ప్రధాని సంచరించే అన్ని మార్గాల్లో ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా ప్రధాని పాల్గొనే కార్యక్రమాల ప్రాంతాల చుట్టూ 2 వేల మంది చొప్పున రక్షణ కల్పించనున్నారు. ఇందుకోసం వెస్ట్‌ జోన్‌ ఐసీ సుధాకర్‌ నేతృత్వంలో, డీఐజీ విజయకుమార్‌(DIG Vijayakumar) పర్యవేక్షణలో ఏడుగురు ఎస్పీలతో ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పాటయ్యాయి. ప్రధాని పర్యటించే మార్గాల్లో డ్రోన్ల ఎగురవేతపై నిషేధం విధించారు. ప్రత్యేకంగా విమానాశ్రయం నుంచి చెన్నై సెంట్రల్‌ వరకు దారి పొడవునా భద్రత ఏర్పాటు చేశారు. ఆ రోజున ఆయా ప్రాంతాలను ప్రతి అరగంటకు బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌, జాగిలాలతో తనిఖీ చేపట్టనున్నారు. ఈ ఏర్పాట్లను డీజీపీ శైలేంద్రబాబు గురువారం పరిశీలించారు. చెన్నై సెంట్రల్‌, విమానాశ్రయ ప్రాంతాలకు వచ్చిన ఆయన స్వయంగా ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వరాదని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు.

Updated Date - 2023-04-07T08:07:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising