ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

New terminal: కొత్త టెర్మినల్‌లో ట్రయల్‌ రన్‌ విజయవంతం

ABN, First Publish Date - 2023-04-26T08:55:43+05:30

కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విమాన టెర్మినల్‌(International Airport Terminal)లో ట్రయల్‌ రన్‌ను మంగళవారం విజయవంతంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై): స్థానిక మీనంబాక్కంలో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విమాన టెర్మినల్‌(International Airport Terminal)లో ట్రయల్‌ రన్‌ను మంగళవారం విజయవంతంగా నిర్వహించారు. ఇందులోభాగంగా ఢాకా నుంచి చెన్నైకు కొందరు ప్రయాణికులతో విమాన సర్వీసు నడిచింది. ఈ విమానం టెర్మినల్‌లో విజయవంతంగా ల్యాండ్‌ అయింది. ఈ విమానంలో వచ్చిన ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు అధికారులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదర స్వాగతం పలికారు. మొత్తం 1,36,295 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ టెర్మినల్‌ను నిర్మించారు. దీన్ని ఈనెల 8న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సమక్షంలో ప్రధానమంత్రి మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. పర్యావరణానికి హాని కలిగించని విధంగా ఈ గ్రీన్‌ఫీల్డ్‌ టెర్మినల్‌ను నిర్మించారు. ఇక్కడ నిర్మించిన రన్‌వే పై మంగళవారం తొలిసారి నిర్వహించిన ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. మధ్యాహ్నం 12.55 గంటలకు బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా నుంచి చెన్నై(Chennai)కు యూఎస్‌ బంగ్లా విమాన సంస్థకు చెందిన ఫ్లైట్‌ విజయవంతంగా ల్యాండ్‌ అయింది. ఈ విమానంలో చెన్నైకు వచ్చిన ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు అధికారులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఆ తర్వాత ఇదే విమానం మధ్యాహ్నం 1.55 గంటలకు చెన్నై నుంచి ఢాకాకు బయలుదేరి వెళ్ళింది. కొత్త టెర్మినల్‌లో నిర్మించిన రన్‌వేపై తొలిసారి నిర్వహించిన ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడంతో ఎయిర్‌ పోర్టు అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-04-26T08:55:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising