ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Punjab : అమృత్‌పాల్ సింగ్ కేసులో కీలక మలుపు!

ABN, First Publish Date - 2023-03-19T15:14:56+05:30

ఖలిస్థాన్ (Khalistan) సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే (Waris Punjab De) చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh)ను పరారీలో ఉన్న

Amrit Pal Singh, Punjab
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : ఖలిస్థాన్ (Khalistan) సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే (Waris Punjab De) చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh)ను పరారీలో ఉన్న నేరస్థుడిగా పంజాబ్ పోలీసులు ప్రకటించారు. ఆయనను పట్టుకునేందుకు శనివారం నుంచి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆయన పూర్వీకుల గ్రామం జల్లు ఖేదాలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. హింసాత్మక సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సెక్షన్ 144 నిబంధనలను అమలు చేస్తున్నారు. అదేవిధంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలను పొడిగించారు. పంజాబ్‌తోపాటు పొరుగున ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా హై అలర్ట్ ప్రకటించారు.

ఇదిలావుండగా, ఈ కేసులో దర్యాప్తు బాధ్యతలను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించవచ్చునని, ఆయనపై జాతీయ భద్రత చట్టం (NSA) ప్రకారం కేసు నమోదు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

మరోవైపు అమృత్‌పాల్ సహచరుల్లో నలుగురిని పంజాబ్ పోలీసులు అస్సాంలోని డిబ్రుగఢ్‌కు తీసుకెళ్లారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Assam CM Himanta Biswa Sarma) మాట్లాడుతూ, ఇది పోలీసుల మధ్య సహకారమని వ్యాఖ్యానించారు. గ్రామీణ అమృత్‌సర్ ఎస్ఎస్‌పీ సతీందర్ సింగ్ మాట్లాడుతూ, అజ్నాలా పోలీసు ఠాణాపై జరిగిన దాడి నేపథ్యంలో నమోదైన కేసులో అమృత్‌పాల్ సింగ్‌పై చర్యలు ప్రారంభించామని చెప్పారు. ఆయన పరారయ్యారని, ఆయన సహచరుల్లో ఏడుగురిని అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి 12-బోర్ వెపన్స్, కార్‌ట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇవన్నీ చట్టవ్యతిరేక ఆయుధాలని చెప్పారు. వీరిపై ఆయుధాల చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అమృత్‌పాల్‌ను త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు.

ఖలిస్థాన్ (Khalistan) సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే (Waris Punjab De) చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) పాకిస్థానీ ఐఎస్ఐ (Pakistani spy agency) ఏజెంట్ అని నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఈ పాకిస్థానీ గూఢచార సంస్థ భారత దేశంలో హింసను సృష్టించేందుకు, ఖలిస్థాన్ వేర్పాటువాద ఉద్యమాన్ని రగిలించేందుకు ఆయనను భారత దేశానికి తీసుకొచ్చిందని వెల్లడిస్తున్నాయి. సిక్కులపై భారత ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని, ప్రత్యేక ఖలిస్థాన్ ఏర్పాటయ్యేందుకు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలపై సాయుధ తిరుగుబాటు చేయాలని సిక్కు యువతను అమృత్‌పాల్ రెచ్చగొడుతున్నాడని నిఘా అధికారులు తెలిపారు. పంజాబ్ పోలీసులు శనివారం ఆయన సహచరుల్లో కొందరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

Rahul Gandhi : రాహుల్ గాంధీ నివాసానికి పోలీసు దళాలు... ‘భారత్ జోడో యాత్ర’లో ప్రసంగం చిచ్చు...

Punjab : అమృత్‌పాల్ సింగ్ పాకిస్థానీ ఐఎస్ఐ ఏజెంట్ : నిఘా వర్గాలు

Updated Date - 2023-03-19T15:14:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising