Bharat NCAP : కార్లకు రేటింగ్ ఇచ్చే పథకాన్ని ప్రారంభించనున్న నితిన్ గడ్కరీ
ABN, First Publish Date - 2023-08-22T11:05:58+05:30
మోటారు వాహనాల భద్రతా ప్రమాణాలను పెంచడం ద్వారా రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో ఓ కార్యక్రమాన్ని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) మంగళవారం ప్రారంభిస్తారు.
న్యూఢిల్లీ : మోటారు వాహనాల భద్రతా ప్రమాణాలను పెంచడం ద్వారా రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో ఓ కార్యక్రమాన్ని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) మంగళవారం ప్రారంభిస్తారు. 3.5 టన్నుల వరకు సామర్థ్యంగల మోటారు వాహనాలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కార్లలో అత్యంత సురక్షితమైన కారును ఎంపిక చేసుకోవడానికి ఈ పథకం అవకాశం కల్పిస్తుంది.
భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (Bharat New Car Assessment Programme - NCAP)ను నితిన్ గడ్కరీ మంగళవారం ప్రారంభిస్తారని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. మార్కెట్లో అందుబాటులో ఉన్న మోటారు వాహనాల క్రాష్ సేఫ్టీని సరిపోల్చుకుని, మదింపు చేసుకుని ఎంపిక చేసుకోవడానికి కస్టమర్లకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపింది. కార్ల తయారీదారులు తమ కార్లను ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారం పరీక్షించడానికి తమ కార్లను స్వచ్ఛందంగా ఇవ్వవచ్చునని తెలిపింది.
భారత్ ఎన్‌సీఏపీ ముఖ్యాంశాలు:
- పరీక్షల్లో కార్ల పనితీరునుబట్టి వాటికి ఎన్‌సీఏపీ రేటింగ్స్ ఇస్తుంది. అడల్ట్ ఆక్యుపెంట్స్ (AOP), చైల్డ్ ఆక్యుపెంట్స్ (COP) అనే స్టార్ రేటింగ్స్‌ను ఇస్తుంది. కారును కొనాలనుకునే కస్టమర్ ఈ రేటింగ్స్ ఆధారంగా తనకు నచ్చిన కారును ఎంపిక చేసుకోవచ్చు.
- దీనివల్ల సురక్షితమైన కార్లకు డిమాండ్ పెరుగుతుంది. తద్వారా మాన్యుఫ్యాక్చరర్లు కస్టమర్ల అవసరాలకు తగిన కార్లను తయారు చేస్తారు.
- ఇది చాలా సాహసోపేతమైన చర్య అని టొయోటా, మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీందా అభివర్ణించాయి.
ఇవి కూడా చదవండి :
Surgical Strike : భారత్ మళ్లీ పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రేక్ చేసిందా?
4 రకాల రొమ్ముక్యాన్సర్ జన్యువుల గుర్తింపు
Updated Date - 2023-08-22T11:17:42+05:30 IST